మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Oct 04, 2020 , 06:39:54

కనకరాజుకు ఎక్స్‌లెన్స్‌ జాతీయసేవా అవార్డు

కనకరాజుకు ఎక్స్‌లెన్స్‌ జాతీయసేవా అవార్డు

బచ్చన్నపేట, అక్టోబర్‌ 3 : మండలంలోని చిన్నరామన్‌చర్లకు చెందిన తెలంగాణ సాంసృతిక సారధి కళాకారుడు కేమిడి కనకరాజుకు జాతీయ సేవా లీడర్‌షిప్‌ అవార్డు దక్కింది. కొన్నేళ్లుగా రచయితగా, గాయకుడిగా రాణిస్తున్న కనకరాజును గుర్తించి మయూరి ఆర్ట్స్‌ సంస్థ 2020 సంవత్సరానికి గాను బెస్టు రైటర్‌ అవార్డును శనివారం హైదరాబాద్‌ సుందరయ్య కళాభవన్‌లో ప్రముఖ నిర్మాత సాయి వెంకట్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కనకరాజు విలేకరులతో మాట్లాడుతూ తను రాసిన గీతాలు , పాడిన పాటలను ఆదరించిన అభిమానులకు, తనకు జాతీ య స్థాయిలో అవార్డు అందించిన మయూరి ఆర్ట్స్‌కు ఈ సందర్భంగా కృతజతలు తెలిపారు.

VIDEOS

logo