చెన్నై: భారత యువ బైక్ రేసర్, చెన్నైకి చెందిన కెవిన్ సమర్ క్వింటల్ ఎఫ్ఐఎం జూనియర్ గ్రాండ్‌ప్రిలో అంచనాలకు మించి రాణించాడు. పోర్చుగల్‌లోని లిస్బన్ వేదికగా జరిగిన రెండో రౌండ్ రేస్ టాప్-10లో నిలిచాడు.
ఫిఫ్టీ మోటార్‌స్పోర్ట్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 18 ఏండ్ల కెవిన్.. 11 ల్యాప్స్‌ను 23 నిమిషాల 19.001 సెకన్లలో పూర్తిచేశాడు. స్పెయిన్ కుర్రాడు అడ్రియన్ 16:092 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరి మొదటిస్థానాన్ని దక్కించుకున్నాడు.