అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
ఈ తరం సీనియర్లు అరవైలోనూ ఇరవైలా థింక్ చేస్తున్నారు. ముదిమి వయసులోనూ మదిలో ఒకరికి చోటివ్వడానికి సిద్ధమవుతున్నారు. జీవితమంతా ఒకరికొకరు తోడుగా నిలవాలని ఫిక్సవుతున్నారు. సహజీవనంతో సాగిపోయేవారు కొందరైతే, పునర్వివాహం చేసుకొని సెటిలవుతున్నవారు ఇంకొందరు. ఈ ట్రెండ్‌నే ‘గ్రే లవ్' అని పిలుస్తున్నారు.
గ్రే లవ్.. కొత్త ట్రెండ్ గురూ!
పరుగులు తీసే కాలం.. అన్నిటా మార్పులకు సాక్షిగా నిలుస్తున్నది. కాలంతో పోటీ పడుతున్న యంగ్ జనరేషన్ స్ఫూర్తితో పాతతరం కూడా ఆ కాలం తీసుకొస్తున్న మార్పులకు నిదానంగా స్వాగతం పలుకుతున్నది. నిన్నటి వరకు యాభయ్యోపడిలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిలో సింహభాగం.. శేష జీవితాన్ని ఒంటరిగా గడిపేవారు. కానీ, ఈ తరం సీనియర్లు అరవైలోనూ ఇరవైలా థింక్ చేస్తున్నారు. ముదిమి వయసులోనూ మదిలో ఒకరికి చోటివ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఒక డిన్నర్‌కో, డేట్కో పరిమితం చేయాలని భావించడం లేదు. మిగిలిన జీవితమంతా ఒకరికొకరు తోడుగా నిలవాలని ఫిక్సవుతున్నారు. సహజీవనంతో సాగిపోయేవారు కొందరైతే, పునర్వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నవారు ఇంకొందరు. ఈ ట్రెండ్‌నే ‘గ్రే లవ్’ అని పిలుస్తున్నారు. ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పుకొంటున్న ఈ పోకడ.. రానున్న రోజుల్లో ప్రపంచమంతా విస్తరిస్తుందని విశ్లేషకుల అంచనా! ఈ వయసులో మరొకరి తోడును కోరుకోవడం అంటే పాత జ్ఞాపకాలను మర్చిపోవడం కాదు. భయాన్ని, అపరాధ భావాన్ని దాటుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడం.
ఈ రోజుల్లో 60, 70 ఏండ్ల వయసులు శారీరకంగా, మానసికంగా ఎంతో చురుగ్గా ఉంటూ రిటైర్మెంట్ను ఒక కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. పాతికేండ్ల వయసులో డేటింగ్ చేసినప్పుడు ఉండే కెరీర్, ఇల్లు, పిల్లల బాధ్యతల ఒత్తిళ్లు ఇకడ ఉండవు. ఈ ప్రేమలో కేవలం పరస్పర గౌరవం, కలిసి ప్రయాణించే సంతోషం మాత్రమే ఉంటాయి. ఇలాంటి వాళ్లను ఒక్కటిగా కలిపేందుకు సాంకేతికత, సీనియర్ డేటింగ్ యాప్‌లు మరింత సాయపడుతున్నాయి. జీవిత అనుభవాల ద్వారా వచ్చిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ బంధాలలో స్పష్టత, పరిపక్వత ఎకువగా ఉండటం విశేషం. ఒక మాటలో చెప్పాలంటే.. ప్రేమకూ, తోడుకూ ఎక్స్పైరీ డేట్ ఉండదని ఈ గ్రే లవ్ నిరూపిస్తున్నది.
వైతాళికుల వాణి
మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారికి ఏది చెప్పినా వ్యర్థమే! వాళ్లకు మంచి చెప్పినా చెడుగానే వినిపిస్తుంది!!
– విలియం జేమ్స్, మనోవైజ్ఞానికవేత్త
క్యా సీన్ హై!

Kya Scene Hai Cartoon
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

