Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Pineapple Laden Vehicle Overturns | పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలోని పైనాపిల్స్ రోడ్డు పక్కన పడ్డాయి. అయితే స్థానికులు వాటిని ఎత్తుకెళ్లలేదు. సహాయం కోసం ముందుకు వచ్చారు. బోల్తాపడిన వాహనాన్ని పైకి లేపారు. ఆ తర్వాత రోడ్డుపై పడిన పైనాపిల్స్‌ను తిరిగి ఆ వాహనంలోకి చేరవేశారు.
తిరువనంతపురం:పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలోని పైనాపిల్స్ రోడ్డు పక్కన పడ్డాయి. అయితే స్థానికులు వాటిని ఎత్తుకెళ్లలేదు. సహాయం కోసం ముందుకు వచ్చారు. బోల్తాపడిన వాహనాన్ని పైకి లేపారు. ఆ తర్వాత రోడ్డుపై పడిన పైనాపిల్స్‌ను తిరిగి ఆ వాహనంలోకి చేరవేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Pineapple Laden Vehicle Overturns) కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన వాహనం పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్నది. తిరువనంతపురంలోని పల్లిచల్ ప్రాంతంలో అదుపుతప్పింది. రోడ్డు పక్కన అది బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలోని పైనాపిల్స్ రోడ్డు పక్కన కుప్పగా పడ్డాయి.
కాగా, ఈ ప్రమాదాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సహాయం కోసం ముందుకు వచ్చారు. కొందరు వ్యక్తులు కలిసి బోల్తాపడిన ఆ వాహనాన్ని పైకి లేపారు. ఆ తర్వాత రోడ్డు పక్కన కుప్పగా పడిన పైనాపిల్స్‌ను తిరిగి ఆ వాహనంలోకి చేర్చారు. ఒక్క పండును కూడా ఎవరూ ఎత్తుకెళ్లలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో స్థానికుల సహాయాన్ని నెటిజన్లు ప్రశంసించారు. ఏమాత్రం సంకోచించకుండా సహాయం కోసం వారు ఏకమవ్వడాన్ని, కిందపడిన పైనాపిల్స్‌ను తిరిగి వాహనంలోకి చేర్చడాన్ని పలువురు అభినందించారు. ఒకవేళ ఇదే సంఘటన మరో రాష్ట్రంలో జరిగి ఉంటే వాహనంలోని వస్తువులను స్థానికులు దోచుకుని పారిపోయేవారని కొందరు వ్యాఖ్యానించారు.
A mini-truck carrying pineapples overturned in Kerala. Instead of looting the scattered fruit, locals came together, collected and loaded them back onto the truck.
Imagine if it was another Indian state, the passerbys would have looted the truck and ran away. https://t.co/HZT8ay62SZ
— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) November 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

