Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
Collector Priyanka | బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, ఆర్థిక స్వావలంబన సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు.
ఊట్కూర్ : బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, ఆర్థిక స్వావలంబన సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక ( Collector Priyanka) సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలో బాల్య వివాహ ముక్త్ భారత్ ( Balya Vivaha Mukt Bharat ) ప్రచారంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. ఇప్పటికే 60కి పైగా గ్రామ పంచాయతీలు బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటించు కునేందుకు సంకల్పించాయని తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తల్లి దండ్రులు, మతపెద్దలు బాల్య వివాహాల నివారణలో భాగస్వాములు కావాలని కోరారు. బాల్య వివాహాలు జరిపించబోమని మతపెద్దలు నిర్ణయించుకోవాలని, సమాచారం తెలిస్తే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని సూచించారు.
ఈ ఏడాది నారాయణపేటను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, డీసీపీవో కరిష్మా, మండల ప్రత్యేక అధికారి శంకర్, ఎంపీడీవో పావని, పీఏసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, సర్పంచ్ రేణుక భరత్, మాజీ జడ్పీటీసీ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

