తెలంగాణ బిడ్డల్ని బలిగొన్న కాంగ్రెస్
తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరులో ఆనాడు సిద్ధిపేట గడ్డపై ఎగిరిన పోరు పతాకం.. ఉస్మానియా ప్రాంగణంలో ప్రతిధ్వనించిన చైతన్య గళం.. ఖమ్మం జైలు గోడల వెనుక ఆమరణ దీక్ష చేసిన జననేత గుండెల్లోని సంకల్పం.. చరిత్రను తిరగరాసిన మహోజ్వల ఘట్టం.. దీక్షా దివస్. 2009 అక్టోబర్ 28న ‘ఫ్రీ జోన్ కాదురా.. హైదరాబాద్ మాదిరా’ అంటూ సాగిన జైల్ భరోలో ఉద్యమ నేత కేసీఆర్ అరెస్టుతో మొదలైన ఉద్యమ ఉధృతి, నవంబర్ 29న సిద్ధిపేట వేదికగా నిరాహార దీక్ష ప్రకటనతో తారస్థాయికి చేరింది. నాడు సమైక్య కుట్రలను తెలంగాణ ధైర్యంగా ఎదుర్కొన్నది.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరులో ఆనాడు సిద్ధిపేట గడ్డపై ఎగిరిన పోరు పతాకం.. ఉస్మానియా ప్రాంగణంలో ప్రతిధ్వనించిన చైతన్య గళం.. ఖమ్మం జైలు గోడల వెనుక ఆమరణ దీక్ష చేసిన జననేత గుండెల్లోని సంకల్పం.. చరిత్రను తిరగరాసిన మహోజ్వల ఘట్టం.. దీక్షా దివస్. 2009 అక్టోబర్ 28న ‘ఫ్రీ జోన్ కాదురా.. హైదరాబాద్ మాదిరా’ అంటూ సాగిన జైల్ భరోలో ఉద్యమ నేత కేసీఆర్ అరెస్టుతో మొదలైన ఉద్యమ ఉధృతి, నవంబర్ 29న సిద్ధిపేట వేదికగా నిరాహార దీక్ష ప్రకటనతో తారస్థాయికి చేరింది. నాడు సమైక్య కుట్రలను తెలంగాణ ధైర్యంగా ఎదుర్కొన్నది.
కేసీఆర్ దీక్షను అడ్డుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎక్కడికక్కడ కేసులు పెట్టారు, బైండోవర్లతో ఆటంకాలు కలిగించారు. సిద్దిపేట గడ్డపై 15 రోజుల ముందు నుంచి కేసీఆర్ దీక్షకు ఏర్పాట్లు జరిగాయి. నవంబర్ 28 నాటికే దీక్షా స్థలి జనసంద్రమైంది. నిద్రలో ఉండగానే కార్యకర్తలను అరెస్టు చేయాలన్న పోలీసుల వ్యూహాన్ని తిప్పికొడుతూ, రాత్రం తా నిద్రపోకుండా కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలతో సిద్దిపేటను రణస్థలిగా మారిం ది. మరోవైపు, కరీంనగర్‌లోని తెలంగాణ భవన్లో ఉన్న కేసీఆర్‌ను అరెస్టు చేసేందుకు భారీ బలగాలను మోహరించింది. తెల్లవారగానే ఉదయం 7 గంటలకు భవన్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌కు మహిళా నేతలు హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. ‘ధర్మమైన తెలంగాణ ఆకాంక్షను.. పోలీసుల తుపాకులతో ఆపలేరు‘ అని మీడియా తో మాట్లాడిన కేసీఆర్, ఆ వెంటనే 100 వాహనాల కాన్వాయ్‌తో బయలుదేరారు.
అలుగునూరు చౌరస్తాలో ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ ఎస్పీలు, గ్రేహౌండ్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కాన్వాయ్‌ని చుట్టుముట్టి వాహనాల్లో టైర్లలో గాలి తీశాయి. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను పోలీసులు పక్కకు నెట్టడంతో వారి కాలికి గాయమైంది. పోలీసుల తోపులాటలో కేటీఆర్ కిందపడ్డారు. అక్కడే రోడ్డుపై బైఠాయించిన కేసీఆర్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి, ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.
ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లి, తొమ్మిది నాన్-బెయిలబుల్ సెక్షన్లతో కేసులు పెట్టి, 14 రోజుల రిమాండ్ విధించారు. కేసీఆర్ రాకతోనే ఖమ్మం జిల్లా జైలు ప్రారంభమైంది. లాఠీచార్జీలో ఓ విద్యార్థి మరణించాడని న్యాయవాది చెప్పగానే కన్నీళ్లు ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన కేసీఆర్, ‘నేను ఏది జరగొద్దని కోరుకున్ననో.. అదే జరిగింది’ అంటూ ఆవేదన చెందుతూ బెయిల్ పేపర్లపై సంతకం చేయడానికి నిరాకరించారు. జైలులోనే ఆమరణ దీక్ష కొనసాగించారు. ఇటు రంగధాంపల్లి దీక్షా స్థలిలో ‘నేను ఆమరణ దీక్ష చేస్తా‘ అని కూర్చున్న హరీశ్‌రావుపై పోలీసులు లాఠీఛార్జి చేసి అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి జయశంకర్ సార్ ఇంటికి చేరిన కేటీఆర్‌ను పోలీసులు అర్ధరాత్రి 12 గంటలకు అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఖమ్మం దవాఖానలో దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్‌ను డిసెంబర్ 3న అంబులెన్స్‌లో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. డిసెంబర్ 8 నాటికి కేసీఆర్ బరువు 38 కేజీలకు పడిపోయి ప్రొటీన్లు, అల్బూమిన్ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. అయినా కేసీఆర్ దీక్ష కొనసాగించారు.
తెలంగాణ ఉద్యమ సెగకు, కేసీఆర్ ఆమరణ దీక్షకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం ‘The process of forming the state of Telangana will be initiated‘ అంటూ చారిత్రక ప్రకటన చేశారు. ఆ తర్వాత మాట మార్చి వెయ్యి మందికి పైగా తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్నది కాంగ్రెస్ పాలకులే. టీఆర్ఎస్ వల్ల ఏనాడూ ఆత్మహత్యలు జరుగలేదు. కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరి, మోసాల వల్లే తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు. వారు రాసిన ప్రతి సూసైడ్ లెటర్ ఇదే సత్యాన్ని చాటిచెప్పింది. కాబట్టి ఇది ఎవరో ఇచ్చిన రాష్ట్రం కాదు.. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం!
(వ్యాసకర్త: శాసనమండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్)
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

