ఈవెనింగ్ కోర్టులు వద్దు
రాష్ట్రంలో ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటుకు ఉద్దేశించిన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ బార్ అసోసియేషన్ల సమాఖ్య కోరింది. ఈ విధానంపై రాష్ట్రంలోని పలు జిల్లాల బార్ అసోసియేషన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది.
- ఆఫ్‌లైన్‌లో సాధారణ పిటిషన్ల దాఖలుకు అనుమతించాలి
- రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
- హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటుకు ఉద్దేశించిన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ బార్ అసోసియేషన్ల సమాఖ్య కోరింది. ఈ విధానంపై రాష్ట్రంలోని పలు జిల్లాల బార్ అసోసియేషన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు సమాఖ్య ప్రతినిధుల బృందం హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శాంకోశికి శనివారం వినతిపత్రం సమర్పించింది. సాయంత్రం కూడా కోర్టులు నిర్వహిస్తే సిబ్బందిపై అదనపు పనిభారం పడటంతోపాటు మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, కుటుంబ బాధ్యతలు ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయని సమాఖ్య అధ్యక్షుడు గోలి విప్లవ్‌రెడ్డి తెలిపారు.
కోర్టుల పనివేళల్లో మార్పులు చేసే ముందు బార్ అసోసియేషన్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ పిటిషన్ల దాఖలులో తప్పనిసరి చేసిన ఈ-ఫైలింగ్ విధానాన్ని సడలించాలని, నిందితుల వ్యక్తిగత హాజరు మినహాయింపు, గైర్హాజరు, సాధారణ వాయిదాలు, చిన్నపాటి మధ్యంతర దరఖాస్తులను నేరుగా భౌతిక పద్ధతిలో దాఖలు చేసేందుకు అనుమతించాలని కోరారు. డిజిటలైజేషన్‌కు తాము వ్యతిరేకం కాదని పేర్కొంటూ.. ఆచరణ సాధ్యమైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో తాగునీరు, వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించేందుకు చర్యలు చేపడతామని జస్టిస్ శ్యాంకోశి హామీ ఇచ్చినట్లు విప్లవ్‌రెడ్డి తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శులు ఆర్ సుధాకర్, గడ్డం లక్ష్మణ్, బీ దయాకర్‌రెడ్డి, గౌరవ సలహాదారులు ఎస్ సురేందర్‌రెడ్డి, ఏ విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు యాదిలాల్, కనకం రమేశ్, యర్రా నర్సయ్య, పల్లె లింగంగౌడ్, వరింగ్ ప్రెసిడెంట్లు సంజీవ్‌రెడ్డి, బీ జగన్ మోహన్‌రెడ్డి, గౌరు వెంకటేశ్వర్లు, ఏ రామ్మోహన్, బాబురావు, వీ రవి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

