భారత్ తీన్మార్
సొంతగడ్డపై మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ హ్యాట్రిక్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో ఒలింపిక్, ఆసియా గేమ్స్ రజత పతక విజేత చైనాను చిత్తు చేసింది. ఇటీవల ఆసియా గేమ్స్‌లో చైనాను ఓడించి లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించిన సలీమా టెటె సారథ్యంలోని జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది.
- అమ్మాయిలదే ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీ
- ఫైనల్లో 3-1తో చైనాపై గెలుపు
- వరుసగా మూడో టైటిల్‌తో హ్యాట్రిక్
- మొత్తంగా నాలుగో ట్రోఫీతో రికార్డు
భోపాల్: సొంతగడ్డపై మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ హ్యాట్రిక్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో ఒలింపిక్, ఆసియా గేమ్స్ రజత పతక విజేత చైనాను చిత్తు చేసింది. ఇటీవల ఆసియా గేమ్స్‌లో చైనాను ఓడించి లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించిన సలీమా టెటె సారథ్యంలోని జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. భారత్‌కు ఇది మొత్తంగా నాలుగో ట్రోఫీ. 2016లో తొలిసారి విజేతగా నిలిచిన భారత్.. మెగా టోర్నీలో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్టుగా సౌత్ కొరియా (3సార్లు) రికార్డును బ్రేక్ చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత డ్రాగ్ ఫ్లికర్ దీపిక (38, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో భారత విజయంతో కీలక పాత్ర పోషించింది. ఇషిక (42వ ని) మరో గోల్ కొట్టింది.
రెండో భాగంలో గోల్స్ మోత
ఫైనల్లో చైనా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే ఆ జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్ ను ఆతిథ్య డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. 22వ నిమిషంలో చైనాకు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా గోల్ కీపర్ బిచ్చు దేవి ఖరిబామ్ అద్భుతమైన సేవ్స్ చేసింది. కానీ, 25వ నిమిషంలో యుజున్ చెన్ ఫీల్డ్ గోల్ కొట్టగా ఫస్టాఫ్‌ను చైనా 1-0తో ముగించింది. కానీ, విరామం తర్వాత భారత్ గేర్ మార్చింది.
వరుస దాడులతో చైనా రక్షణ శ్రేణిపై ఒత్తిడి పెంచింది.ఈ క్రమంలో జట్టుకు లభించిన మూడో పెనాల్టీ కార్నర్‌ను దీపిక అద్భుత గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేసింది. నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఇషిక ఫీల్డ్ గోల్‌తో జట్టుకు 2-1 ఆధిక్యం అందించింది. ఆ వెంటనే మరో పెనాల్టీ కార్నర్‌ను దీపిక లో-ఫ్లిక్‌తో నెట్లోకి పంపడంతో భారత్ 3-1తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 53వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ వచ్చినా దీపిక షాట్ బయటకు వెళ్లినా చైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఆతిథ్య జట్టు ట్రోఫీని ముద్దాడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

