తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్
‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని దీక్షా దివస్ మలుపు తిప్పింది. ఉద్యమ నేత కేసీఆర్ త్యాగానికి ప్రతీకగా నిలిచిన నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ సభ బీఆర్ఎస్ పార్టీది మాత్రమే కాదు.
- బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వినోద్‌కుమార్
- దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని పిలుపు
కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని దీక్షా దివస్ మలుపు తిప్పింది. ఉద్యమ నేత కేసీఆర్ త్యాగానికి ప్రతీకగా నిలిచిన నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ సభ బీఆర్ఎస్ పార్టీది మాత్రమే కాదు. ఇది యావత్ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలది’ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లోని దీక్షా దివస్ సభా ప్రాంగణంలో మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. ఆదివారం నాటి దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు ప్రజలు, కవులు, కళాకారులు, అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారని వెల్లడించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన త్యాగాలు, పడిన కష్టాలు నేటితరానికి తెలియాలంటే దీక్షా దివస్ వంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఉద్యమంలో కాంగ్రెస్‌ది మొత్తం మోసాల చరిత్రేనని పేర్కొన్నారు.
కేసీఆర్ దీక్షతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగి వచ్చి 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ డిసెంబర్ 23న తెలంగాణ ఇవ్వబోమని చెప్పి మరో సారి మోసం చేసిందని దుయ్యబట్టారు. అప్పుడు ఏర్పడిన జేఏసీలో చేరిన కాంగ్రెస్ ఆ తర్వాత తప్పుకున్నదని తెలిపారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నాయకులు తుల ఉమ, చల్మెడ లక్ష్మీనరసింహారావు, గెల్లు శ్రీనివాస్ యాదవ్, సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

