స్వీట్ అండ్ సోర్ పైనాపిల్ ఊరగాయ.. నోరూరెనయా!
పైనాపిల్ తినడమే తెలుసు కాని ఊరగాయ కూడా పెడతారా అని డౌటనుమానంగా ఉందా. అవును అనుమానం అక్కరలేదు. తీపి, పులుపు కలయికగా ఆ ఊరగాయను చూస్తే నోరూరుతుందయా. పైనాపిల్ ఊరగాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు: రెండు కప్పులు
నువ్వుల నూనె (లేదా) పల్లినూనె: టేబుల్ స్పూను
చింతపండు: నిమ్మకాయంత
ఆవాలు: పావు స్పూను, జీలకర్ర: పావు స్పూను
ఇంగువ: చిటికెడు, కారం: టేబుల్ స్పూను
ధనియాల పొడి: అర టీ స్పూను,
జీలకర్ర పొడి: అర టీ స్పూను
సాంబార్ పొడి: టీ స్పూను
బెల్లం తురుము: పావు కప్పు
పసుపు: అర టీ స్పూను
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
పైనాపిల్‌ను సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నువ్వులు లేదా పల్లి నూనె కొద్దిగా వేసి కాగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టాలి. అందులో పైనాపిల్ ముక్కల్ని వేయాలి. చింతపండును గుజ్జు చేసుకుని బాణట్లో వేయాలి. ఉప్పు, కారం, సాంబార్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి పావు కప్పు బెల్లం తురిమి ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి దగ్గరికి వచ్చేదాకా మిశ్రమాన్ని కలుపుకొంటే తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ ఊరగాయ సిద్ధమైపోతుంది.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

