Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
man tries to marry another woman | పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే లక్ష కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య, సామూహిక వివాహ వేదిక వద్దకు చేరుకున్నది. పోలీసులకు ఫిర్యాదు చేసి అతడి పెళ్లిని అడ్డుకున్నది.
లక్నో: పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే లక్ష కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య, సామూహిక వివాహ వేదిక వద్దకు చేరుకున్నది. పోలీసులకు ఫిర్యాదు చేసి అతడి పెళ్లిని అడ్డుకున్నది. (man tries to marry another woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వృత్తిరీత్యా పెయింటర్ అయిన ఆకాశ్‌కు 2021లో సోనీతో వివాహం జరిగింది. అయితే పెళ్లి నాటి నుంచి భర్త తనను శారీరకంగా హింసిస్తున్నాడని భార్య ఆరోపించింది. వీరిద్దరి విడాకుల కేసుపై విచారణ మూడేళ్లుగా కోర్టులో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు విడిగా నివసిస్తున్నారు.
కాగా, ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద ఇచ్చే లక్ష ఆర్థిక సహాయం కోసం మరో మహిళను రెండో పెళ్లి చేసుకునేందుకు ఆకాశ్ సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య సోని, సామూహిక వివాహ వేదిక వద్దకు చేరుకున్నది. విడాకులు మంజూరు కాకుండానే భర్త ఆకాశ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు సోని ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆమె భర్త ఆకాశ్ రెండో పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబై ఉన్న అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ సామూహిక వివాహ వేదిక వద్ద కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Uttar Pradesh’s Etah district, police detained a groom who had arrived to remarry without divorcing his first wife during a mass wedding ceremony organized by the Chief Minister, following a complaint from his first wife. https://t.co/7Rrqj4NsMb
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- MAN
- Police help
- scheme aid
- Stops
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

