Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Toy Thar To Groom's Family | పెళ్లికి కొన్ని రోజుల ముందు వరుడి కుటుంబం ‘థార్’ వాహనాన్ని డిమాండ్ చేసింది. తమకు స్థోమత లేదని నచ్చజెప్పేందుకు వధువు కుటుంబం ప్రయత్నించింది. అయినా వారు వినలేదు.
లక్నో: పెళ్లికి కొన్ని రోజుల ముందు వరుడి కుటుంబం ‘థార్’ వాహనాన్ని డిమాండ్ చేసింది. తమకు స్థోమత లేదని నచ్చజెప్పేందుకు వధువు కుటుంబం ప్రయత్నించింది. అయినా వారు వినకపోవడంతో వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ను వధువు తండ్రి ఇచ్చాడు. ఆ పెళ్లి సంబంధాన్ని రద్దు చేశాడు. (Toy Thar To Groom’s Family) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జ్ఞాన్పూర్కు చెందిన షంషేర్ కుమారుడికి, సౌలానా గ్రామానికి చెందిన బబ్బర్ కుమార్తెతో ఐదు నెలల కిందట పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో వరుడి కుటుంబానికి లక్ష నగదుతో పాటు ఇతర సాంప్రదాయ కానుకలను వధువు కుటుంబ సభ్యులు అందించారు.
కాగా, నెల రోజుల కిందట వధువు తండ్రి బబ్బర్ ఒక భూమిని విక్రయించాడు. ఈ విషయం తెలిసిన వరుడి కుటుంబ సభ్యులు, వధువు తండ్రిని ‘మహీంద్రా థార్’ కారును డిమాండ్ చేశారు. తమకు అంత స్థోమత లేదని ఒప్పించేందుకు బబ్బర్ పలుమార్లు ప్రయత్నించినా వారు తమ పట్టు వీడలేదు.
మరోవైపు నవంబర్ 28న వివాహ తేదీని ఖరారు చేసేందుకు వరుడి కుటుంబాన్ని తన ఇంటికి బబ్బర్ ఆహ్వానించాడు. అయితే ‘థార్’ వాహనం డిమాండ్ విషయంలో వరుడి కుటుంబం మొండిగా వ్యవహరించింది. దీంతో వధువు తండ్రి తీవ్రంగా కలత చెందాడు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని వేచి ఉంచి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
చివరకు ఒక ప్లాస్టిక్ బొమ్మ ‘థార్’ ను వరుడి తండ్రికి బబ్బర్ ఇచ్చాడు. ‘ఇదిగోండి, దీన్ని తీసుకోండి. మీ చేతుల్లో పట్టుకోండి. వధువు, మానవ సంబంధాలు మీకు అవసరం లేదు, కారు కావాలి అంతే కదా! ఇదిగోండి, మీకు ‘థార్’ కారు ఇచ్చేశాం. దీన్ని నడుపుకుంటూ వెళ్లండి. మీరు మీ ఇంట్లో సంతోషంగా ఉండండి. మేము మా ఇంట్లో ఉంటాం’ అని అన్నాడు. అలాగే పెళ్లితో పాటు జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వధువు తండ్రి బబ్బర్ ప్రకటించారు. వరుడి కుటుంబం ఇచ్చిన నిశ్చితార్థానికి సంబంధించిన లాంఛనాలను కూడా వారు తిరిగి ఇచ్చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Uttar Pradesh –In Meerut, just before the wedding, the groom asked for a Thar, so the bride’s family handed him a plastic toy Thar and called off the marriage!!🫡🫡 https://t.co/mcTMocyk5F
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Calls off
- Gives
- Groom's Family
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

