జిడ్డు ఇలా వదిలిద్దాం
శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే క్లీన్‌గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే.. పాత్రలను మురికి లేకుండా శుభ్రంగా కడగడం మరో ఎత్తు.
శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే క్లీన్‌గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే.. పాత్రలను మురికి లేకుండా శుభ్రంగా కడగడం మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో దాదాపు అందరి ఇళ్లలోనూ స్టీల్ పాత్రలలోనే వంటలు చేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడం సులభమే. కానీ, రోటీ, దోశ, చపాతి చేసే ఐరన్ పాత్రల జిడ్డు వదిలించడం అనేది కష్టమైన పని. ఇక, ఐరన్ పాత్రలో కూరలు వండటం వల్ల అవి త్వరగా నల్లగా మారుతాయి. నూనె పొరలు పేరుకుపోతాయి. నల్లగా మారిన ఐరన్ పాత్రలో వండిన ఆహారం కూడా నల్లగా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలను శుభ్రం చేయడం కూడా కష్టం. అయితే, చిన్న చిట్కాలతో వంటపాత్రలను తళతళలాడేలా చేసుకోవచ్చు.
బేకింగ్ సోడా, ఉప్పుతో..
ఒక లీటరు నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా, ఉప్పు వేసి మరిగించాలి. ఆ వేడి నీటిని నల్లగా మారిన ఐరన్ పాత్రలో పోసి అరగంట సేపు ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో కడిగేస్తే సరిపోతుంది.
నిమ్మకాయతో..
చాలా వస్తువులను శుభ్రం చేయడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు చెంచాల నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్, నూనె వేసి పది నిమిషాలు మరిగించాలి. ఆ నీరు పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
వెనిగర్..
పాత్రలకు పట్టిన మరకలను తొలగించడంలో వెనిగర్ మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బాగా మరకలు పడిన గిన్నెలో నీరు, వైట్ వెనిగర్ సమాన పరిమాణంలో వేసి నానబెట్టాలి. నానబెట్టిన అనంతరం బ్రష్‌తో స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వెనిగర్‌లో ఉండే యాసిడ్ లక్షణాలు మరకలను వదిలించడానికి సహాయపడతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

