Nature Therapy | ప్రకృతిలోగడపడం వల్ల వారితో దృఢంగా సంబంధాలు..
రోజూ కొంతసేపు ప్రకృతికి దగ్గరగా గడపడాన్ని ఎకో థెరపీ లేదా నేచర్ థెరపీ అని పిలుస్తారు. ఇలా చేయడం వల్ల మనిషి ప్రకృతికి దగ్గరయిన అనుభూతి కలుగుతుంది. పచ్చదనం ఉన్నచోట నడిచినా, తోటపని చేసినా మంచిదేనట. సహజమైన వాతావరణంలో ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతత, నిర్మలత్వం సిద్ధిస్తాయి. జాగరూకత అలవడుతుంది.
ప్రకృతిలో కాసేపు…
Nature Therapy | రోజూ కొంతసేపు ప్రకృతికి దగ్గరగా గడపడాన్ని ఎకో థెరపీ లేదా నేచర్ థెరపీ అని పిలుస్తారు. ఇలా చేయడం వల్ల మనిషి ప్రకృతికి దగ్గరయిన అనుభూతి కలుగుతుంది. పచ్చదనం ఉన్నచోట నడిచినా, తోటపని చేసినా మంచిదేనట. సహజమైన వాతావరణంలో ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతత, నిర్మలత్వం సిద్ధిస్తాయి. జాగరూకత అలవడుతుంది. కుంగుబాటు ముప్పు తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబసభ్యులతో, మిత్రులతో ప్రకృతిలో గడపడం వల్ల వారితో సంబంధాలు బలోపేతం అవుతాయి. నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుంది.
పార్కిన్సన్కు సంగీత నృత్య చికిత్స
నృత్యం, సంగీత థెరపీలను ధ్యానంతో కలిపి చేయడం వల్ల మెదడుకు సంబంధించిన రుగ్మత అయిన పార్కిన్సన్ అభివృద్ధి నెమ్మదిస్తుందని ఓ తాజా పరిశోధనలో తేలింది. ముంబైకి చెందిన జస్లోక్ హాస్పిటల్ ఈ పరిశోధన నిర్వహించింది. ఓ మోస్తరు పార్కిన్సన్ వ్యాధి బారినపడిన 28 మందిని ఆరు నెలలకు పైగా అధ్యయనం చేశారు. నృత్యం, సంగీత చికిత్సలకు ధ్యానాన్ని మేళవించడం వల్ల జీవన నాణ్యత పెరగడమే కాకుండా, పార్కిన్సన్ అభివృద్ధి నెమ్మదించినట్టు వెల్లడైంది. రోజువారీగా ఈ చికిత్సను అనుసరించడం వల్ల ఈ రుగ్మత అభివృద్ధిని నెమ్మదింప చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఆరోగ్యమైనవే ఆరగించండి
ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నప్పటికీ అనారోగ్యకర ఆహారం వైపు నాలుక గుంజుతుంటుంది. ఓ ఐస్ క్రీం లాగిద్దాం అనిపిస్తుంది. లేదంటే ఏ చిప్సో కరకరలాడిస్తే బాగుండనిపిస్తుంది. అయితే, తాజా పండ్లు లాంటి వాటిపై మనసుపడితే మంచిదే కానీ, ఉప్పు, చక్కెరలు ఎక్కువగా ఉన్నదీ, అనారోగ్యకరమైన ఆహారం మాత్రం ఒంటికి అసలు మంచిది కాదు. ఈ సమస్యకు నిపుణులు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు. తగినన్ని నీళ్లు తాగడం, ఆహారంలో ప్రొటీన్లు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవడం, మనసు మార్చుకోవడం, మంచి నిద్ర, సమతులాహారంతో దీన్నుంచి బయటపడొచ్చు.
పిల్లల్లోనూ ఎన్ఏఎఫ్ఎల్డీ
కొంతమంది వైద్య నిపుణుల ప్రకారం గత పదేండ్లలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ)తో బాధపడుతున్న పిల్లల సంఖ్య 10 నుంచి 33 శాతం పెరిగింది. మామూలుగా ఊబకాయుల్లో కనిపించే ఈ సమస్య పిల్లల్లో ఎక్కువవుతుండటం ఆందోళనకరం. దీనికి చక్కెరలు ఎక్కువగా ఉన్న ప్రాసెస్డ్ ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులున్న ఆహారం తీసుకోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల కాలేయ కణాల్లో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు పేరుకుపోతాయి. దీంతో శరీరంలో పేరుకున్న చెడుకొవ్వును వదిలించే కాలేయం సామర్థ్యం తగ్గిపోతుంది. తొలిదశలో హానికరం కాకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో కాలేయానికి కీడు చేస్తుంది. చక్కెరలు, జంక్ ఫుడ్ తగ్గించుకోవడం, రోజుకు అరగంట వ్యాయామం లాంటి మార్పులతో పిల్లలు ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

