China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
China flies electric plane | ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువల తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనా ఈ దిశగా మరో ముందడుగు వేసింది. ఎలక్ట్రిక్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. బ్యాటరీతో నడిచే 19 సీట్ల విద్యుత్ ప్రయాణీకుల విమానాన్ని తొలిసారి విజయవంతంగా నడిపింది.
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువల తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనా ఈ దిశగా మరో ముందడుగు వేసింది. ఎలక్ట్రిక్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. బ్యాటరీతో నడిచే 19 సీట్ల విద్యుత్ ప్రయాణీకుల విమానాన్ని తొలిసారి విజయవంతంగా నడిపింది. 10 టన్నుల బరువున్న సీఈ-25ఏ ఎలక్ట్రిక్ విమానం, నవంబర్ 14న షాన్డాంగ్ ప్రావిన్స్‌లో తొలి పైలట్ సహిత ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ విద్యుత్ విమాన ప్రయాణం 57 నిమిషాల 46 సెకన్ల పాటు కొనసాగింది. 16 నిమిషాల 38 సెకన్ల పాటు అది గాలిలో ఎగిరి 60.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ అందులో ఉన్నట్లు పేర్కొంది. పరీక్షా సమయంలో ఈ విద్యుత్ విమానం సాధారణంగా పనిచేసినట్లు వివరించింది.
కాగా, చైనా బ్యాటరీ తయారీ సంస్థ సీఏటీఎల్, షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయం, ఇతర భాగస్వాములతో కలిసి ఈ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ప్లేన్‌ను కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (సీవోఎంఏసీ) అభివృద్ధి చేస్తున్నది. సీఈ-25A విద్యుత్ విమానాన్ని సుమారు 400 కిలోమీటర్ల దూరం వరకు 19 మంది ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు రూపొందించారు. దీని గరిష్ట టేకాఫ్ బరువు 10 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 300 కిలోమీటర్లు. 2,400 మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది.
అయితే అనేక డక్టెడ్ ఫ్యాన్లతో కూడిన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా ఈ విద్యుత్ విమానం పనిచేస్తుంది. ఈ ఫ్యాన్లు రెక్కల వెంబడి అమర్చి ఉంటాయి. విమానంలోని బ్యాటరీ వ్యవస్థ ద్వారా ఈ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ మోటార్లు విద్యుత్ శక్తిని పొందుతాయి. ప్రధాన నగరాల మధ్య సుదూర ప్రయాణాల కోసం కాకుండా, చిన్న ప్రాంతీయ ప్రయాణాల కోసం ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని అభివృద్ధి చేశారు.
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి ఆటోమేటిక్ మానవ రహిత ప్రయాణాన్ని ఇది పూర్తి చేసింది. ఆ తర్వాత 19 సార్లు మానవ రహిత టెస్ట్‌లు నిర్వహించారు. తాజాగా తొలిసారి ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్‌తో కలిసి మానవ సహిత పరీక్షలను ఇది పూర్తి చేసింది. వాణిజ్య వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ దరఖాస్తును కూడా చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. దీంతో ఈ 19 సీట్ల విద్యుత్ విమానం త్వరలో ప్రయాణికులతో పాటు నింగిలోకి ఎగురనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Illegal assets | ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. టీపీవోపై కేసు నమోదు
Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

