Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు 12 మంది వ్యక్తులు వందే భారత్ రైలు ఎక్కారు. ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో వారు అందులో చిక్కుకుపోయారు. సుమారు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంతో పాటు జరిమానా కూడా చెల్లించారు.
లక్నో: బంధువులను సాగనంపేందుకు 12 మంది వ్యక్తులు వందే భారత్ రైలు ఎక్కారు. ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో వారు అందులో చిక్కుకుపోయారు. సుమారు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంతో పాటు జరిమానా కూడా చెల్లించారు. (Vande Bharat Train) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 15న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు 12 మంది వ్యక్తులు చేరుకున్నారు. వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి తమ బంధువులను ఎక్కించారు. అయితే వారంతా ఆ రైలు లోపల ఉండగానే ఆటోమేటిక్ డోర్స్ మూసుకుపోయాయి. డోర్ తెరువాలని రైల్వే సిబ్బందిని వారు వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. స్టేషన్ నుంచి కదలడంతో మహిళలు, పిల్లలతో కూడిన ఆ 12 మంది ఆ వందే భారత్ రైలులో చిక్కుకుపోయారు. దీంతో ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
కాగా, వందే భారత్ రైలులో చిక్కుకున్న ఆ 12 మందితో పాటు వారి పరిస్థితిపై కొందరు ప్రయాణికులు కూడా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తుండ్లా రైల్వే కంట్రోల్ రూమ్‌కు రైల్వే సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10.49 గంటలకు ఇటావా జంక్షన్ వద్ద ఆ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు.
మరోవైపు ఇటావా జంక్షన్ స్టేషన్ సూపరింటెండెంట్, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు. వందే భారత్ రైలులో చిక్కుకున్న 12 మందిని ఆ స్టేషన్లో దించారు. వారిని ఆర్పీఎఫ్ కార్యాలయానికి తరలించారు. సరైన టికెట్ లేకుండా వందే భారత్ రైలులోకి ప్రవేశించడంతో పాటు రైల్వే నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున జరిమానా విధించి రూ.36,000 వసూలు చేశారు. మరోసారి ఇలా చేయవద్దని వారిని హెచ్చరించి వదిలేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ సిబ్బందిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

