Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Congress Leader Extorts Rs 10 lakh | ఎంపీ సహాయకుడైన కాంగ్రెస్ నేత, ఒక హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఆ హాస్పిటల్ యాజమాని ఫిర్యాదుతో ఆ నేతను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: ఎంపీ సహాయకుడైన కాంగ్రెస్ నేత, ఒక హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఆ హాస్పిటల్ యాజమాని ఫిర్యాదుతో ఆ నేతను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించింది. (Congress Leader Extorts Rs 10 lakh) కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఈ సంఘటన జరిగింది. తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సభ్యుడు, కన్నూర్ ఎంపీ కే సుధాకరన్‌కు సన్నిహితుడైన సుహైల్ షాజహాన్ ఒక ప్రైవేట్ సంతానలేమి క్లినిక్ యజమానిని బ్లాక్మెయిల్ చేశాడు. ‘చంగాతికూట్టం’ అనే సోషల్ మీడియా పేజీలో ఆ క్లినిక్‌కు వ్యతిరేకంగా ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో తొలగించడానికి క్లినిక్ యజమానిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే మరింత నష్టం కలిగించే వీడియోలు అప్లోడ్ చేస్తానని బెదిరించాడు.
కాగా, ఆ క్లినిక్ యజమాని అయిన డాక్టర్, పెట్టా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నేతను ట్రాప్ చేసేందుకు పోలీసులు ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పోలీసుల సూచన మేరకు సుహైల్ షాజహాన్ అడిగిన డబ్బు చెల్లించేందుకు ఆ డాక్టర్ అంగీకరించారు. మంగళవారం ఆ క్లినిక్ చేరుకున్న కాంగ్రెస్ నేత, ఆ డాక్టర్ నుంచి రూ.10 లక్షలు తీసుకుంటుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాజకీయ అండతో ఆ నేత చేస్తున్న ఇతర కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు క్లినిక్ యజమాని నుంచి సుహైల్ షాజహాన్ రూ.10 లక్షలు తీసుకుంటున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం చర్యలు చేపట్టింది. సుహైల్ షాజహాన్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.
అయితే కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిపై స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ‘క్షీణ రాజకీయ సంస్కృతిని’ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దాని ‘వికార రూపాన్ని’ ఈ అరెస్ట్ బయటపెట్టిందని ఎక్స్‌లో విమర్శించారు.
Youth Congress leader Suhail Shahjahan and close associate of Kerala CM VD Satheesan was caught taking bribes on Camera. He took 10 lakhs in bribe from a private hospital owner in exchange for deleting defamatory video against him.Pure Suvendu vibes.
(1/2) https://t.co/QeSVVi4STz— Prayas Perumal/প্রয়াস পেরুমাল (@Aqualord17) November 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

