ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్...
కోదాడ, నవంబర్ 18 : జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు న్యాయ సేవలు, వివిధ చట్టాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి కె.సురేశ్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ క్రిమినల్, సివిల్ అలాగే రెవెన్యూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు సైతం తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించవచ్చని, వారికి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాలు, కుటుంబ చట్టాలు, భూ సమస్యల పరిష్కార మార్గాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, తాసీల్దార్ సంతోష్ కుమార్, న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, ఉయ్యాల నరసయ్య, కోడూరు వెంకటేశ్వరరావు, మంద వెంకటేశ్వర్లు, సామా నవీన్ కుమార్, దుగ్గి వెంకటేష్ రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు రిమండ్
Hormones | పండుగల అనంతరం హార్మోన్లలో మార్పులు వస్తాయా.. ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

