Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Cop Threaten Couple Frame Drug Case | పోలీసులు ఒక హోటల్‌పై రైడ్ చేశారు. ఆ హోటల్లో బస చేసిన జంటను ఒక పోలీస్ అధికారి బెదిరించారు. వారి బ్యాగ్‌లో గంజాయి ఉంచి డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని ఆయన హెచ్చరించారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: పోలీసులు ఒక హోటల్‌పై రైడ్ చేశారు. ఆ హోటల్లో బస చేసిన జంటను ఒక పోలీస్ అధికారి బెదిరించారు. వారి బ్యాగ్‌లో గంజాయి ఉంచి డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని ఆయన హెచ్చరించారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Cop Threaten Couple Frame Drug Case) మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 13న ఏఎస్పీ దీపక్ మిశ్రా తన బృందంతో కలిసి ఒక హోటల్‌పై రైడ్ చేశారు. ఆ హోటల్ రూమ్‌లో బస చేసిన ఒక జంటను పోలీసులు వేధించారు.
కాగా, తాము వయోజనులమని, ఒకే కులానికి చెందినవారమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆ మహిళ పోలీసులతో చెప్పింది. వారి తల్లిదండ్రుల కాంటాక్ట్ నంబర్లు ఇవ్వాలని ఆ జంటను పోలీసులు బలవంతం చేశారు. అయితే ఆ మహిళ తన మొబైల్ ఫోన్ అన్‌లాక్ చేసేందుకు, తన కుటుంబానికి ఫోన్ చేసేందుకు నిరాకరించింది.
మరోవైపు ఏఎస్పీ దీపక్ మిశ్రా ఆ జంటను డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించారు. ‘ఆ అబ్బాయి బ్యాగ్‌లో గంజాయి ఉంచండి’ అని తన పోలీస్ సిబ్బందికి ఆయన సూచించారు. ఆ జంటను డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు వారిని తీవ్రంగా మందలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే పోలీసులు తనను నెలకు రూ.25,000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఆ హోటల్ యజమాని ఆరోపించాడు. తాను నిరాకరించడంతో తన హోటల్‌పై రైడ్ చేసి ఆ జంటను పోలీసులు వేధించినట్లు వివరించాడు. పోలీసుల బాగోతాన్ని బయటపెట్టేందుకు తానే స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఆ హోటల్ యజమాని వెల్లడించాడు.
A disturbing video from Seoni, Madhya Pradesh, raises serious questions about police accountability.
Additional SP is allegedly heard telling hotel staff to plant marijuana and frame people in a case.
Is police there for protection or framing false charges ? https://t.co/8sooGVKvSB
— Pankaj (@Ragepkj1) November 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 145 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

