ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను బీజేపీ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
ములకలపల్లి, నవంబర్ 18 : గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను బీజేపీ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు ననావత్ బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సా ముండా సాగించిన పోరాటం, గిరిజన హక్కుల కోసం చేసిన త్యాగాలు, ధైర్య సాహసాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బిర్సా ముండా జీవిత చరిత్రను యువత తెలుసుకుని ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి, మండల అధ్యక్షుడు గుగులోత్ శంకర్ నాయక్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అనముల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఊకంటి మధుసూదన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, అత్యం సాయి, భానోత్ మల్లేష్, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు గొడ్ల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న, బోగి కృష్ణయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొట్టి పుల్ల దుర్గా శ్రీనివాసరావు, రాష్ట్ర గిరిజన మోర్చా సభ్యుడు తంబల రవి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉడకనేని విశ్వేశ్వరరావు, పాలకుర్తి శ్రీను, మెట్ట వెంకటేశ్వర్లు, పుష్కర్, ఎస్వీటీ కొండయ్య, అచ్చన రంగారావు, తోట వెంకటేశ్వర్లు, ఎర్రం శెట్టి శ్రీను, చల్లా తిరుమలేశు, కుంజ సీతారాంబాబు, సాయిల శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
Voyager-1 | భూమికి ఒక లైట్ డే దూరంలోకి వాయేజర్-1.. 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సర్పంచ్
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

