Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
Aurobindo Pharma Foundation | మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి డీజీపీ సి. వి. ఆనంద్ కు చెక్కును బుధవారం అందజేశారు.
హైదరాబాద్ : మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ ( Aurobindo Pharma Foundation ) రూ.కోటి డీజీపీ సి. వి. ఆనంద్ ( DGP CV Anand ) కు చెక్కును బుధవారం అందజేశారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ ఎస్. సదానంద రెడ్డి, అరోబిందో ఫార్మా లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ.ఎస్.ఆర్. రావు ఈ చెక్కును డీజీపీకి అందజేశారు.
ఈ విరాళం అందించడంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విరాళం అందేలా కృషి చేశారు. పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాల కల్పన, మౌలిక వసతుల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సాయం దోహదపడనుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్య క్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్ సబర్వాల్ తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
Voyager-1 | భూమికి ఒక లైట్ డే దూరంలోకి వాయేజర్-1.. 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

