Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
MLA Vemula Prashanth Reddy | మొత్తం కొత్త నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ ఇచ్చిన దాని కంటే కాంగ్రెస్ సర్కార్అ దనంగా ఇస్తున్న పెన్షన్లు కేవలం 3,424 మందికి మాత్రమే. అదీ రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం 4,000 ఇవ్వడంలేదు.. అది కూడా కేసీఆర్ ఇచ్చిన 2,000 మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యే వేముల తెలిపారు.
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ఇస్తున్నామని చెప్పుకుంటున్న పెన్షన్లకు సంబంధించిన అంశంలో మంత్రి సీతక్కకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ నుంచి తీసుకున్న డాటా, నేను మీడియా మిత్రులందరికీ కూడా పంపిస్తా. 2023 డిసెంబర్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త నిజామాబాద్ జిల్లాలో 2, 79, 177 మందికి రూ.2 వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నరు. వీళ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో నుంచి 17,131 మందిని తీసేశారన్నారు.
కొంతమంది చనిపోయినవాళ్లుండొచ్చు.. కొందరిని కట్ చేసిర్రు. వివిధ కారణాలతో వారిని తీసేసి ఇప్పుడు కొత్తగా మేం నిజామాబాద్ జిల్లా మొత్తంలో ఇస్తున్నమని చెప్పుకుంటున్న సంఖ్య 20,555. అంటే 17 వేల మందిని తీసేసి 20 వేల మందికి ఇస్తున్నరు.. అంటే మొత్తం జిల్లాలో వారు కేసీఆర్ ఇచ్చిన దాని కంటే అదనంగా ఇస్తున్నది కేవలం 3,424 మందికి మాత్రమే. అదీ రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం 4,000 ఇవ్వడంలేదు.. అది కూడా కేసీఆర్ ఇచ్చిన 2,000 మాత్రమే ఇస్తున్నారు.. మరి ఇది కొత్త స్కీమ్ ఎట్లా అయితదని ఎమ్మెల్యే వేముల ప్రశ్నించారు..
నువ్వు 4000 పెంచి వృద్ధులు, బీడీ కార్మికులకు ఇస్తే అది కొత్త స్కీం.. దానికి మీటింగ్స్ పెట్టుకోవాలి.. ఈ 3000 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు 31 మీటింగ్స్ ప్రతీ మండలంలో పెడుతున్నరు.. దానికే ప్రతి నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు దీనిపై ఆలోచన చేయాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు, జిల్లా మంత్రి అని చెప్పుకుంటున్న సుదర్శన్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సవాల్ విసురుతున్నా.. నేను చెనప్పింది తప్పని రుజువు చేయకపో్తే మీ పదవులకు రాజీనామా చేస్తరా.. అని ఎమ్మెల్యే వేముల ప్రశ్నించారు.
మంత్రి సీతక్కకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిజామాబాద్ జిల్లాలో 17,131 మంది పెన్షన్లు రద్దు చేశారు
ఇప్పుడు 20,555 పెన్షన్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు
నిజానికి వీళ్లు తొలగించిన పెన్షన్లతో పోల్చితే కొత్తగా ఇచ్చేది 3,424 మందికి మాత్రమే
అది కూడా కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 ఇస్తున్నారు కానీ వీళ్లు హామీ ఇచ్చిన 4,000 ఇవ్వడంలేదు
అప్పుడు అది కేసీఆర్ ఇచ్చిన పథకమే అవుతుంది కానీ కొత్త పథకం ఎలా అవుతుంది?
దానికే ప్రతి నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు పెడుతున్నారు
చనిపోయిన వారి స్థానంలో పెన్షన్లు ఇచ్చి కొత్తగా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు
నేను చెప్పింది తప్పు అని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
నిరూపించకపోతే సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేస్తారా?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
Voyager-1 | భూమికి ఒక లైట్ డే దూరంలోకి వాయేజర్-1.. 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

