Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
Urea Fertilizer Sale | రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు విక్రయించాల్సిన వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Urea Fertilizer Sale | దౌల్తాబాద్, నవంబర్ 17: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు విక్రయించాల్సిన వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా బస్తాలు కావాలంటే అదనంగా నానో డీఏపీ కొనుగోలు చేయాల్సిందేనని షరతు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జ్యోతి ఫర్టిలైజర్ దుకాణంలో ఈ తరహా విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన రైతు చాకలి వెంకటయ్య ఆదివారం ఆన్లైన్లో 24 బస్తాల యూరియా బుక్ చేసుకున్నాడు. సోమవారం దుకాణానికి వస్తే మంగళవారం యూరియా ఇస్తామని చెప్పడంతో ఆయన తిరిగి వెళ్లాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు యూరియా కోసం దుకాణానికి చేరుకున్న రైతు సాయంత్రం 4 గంటల వరకు నిరీక్షించినా బస్తాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
యూరియా కావాలంటే నానో డీఏపీ కూడా కొనుగోలు చేయాలని దుకాణ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ షరతు విధించినట్లు వెంకటయ్య ఆరోపించాడు. అదనపు ఎరువులు కొనుగోలు చేయలేమని చెప్పినా యూరియా ఇచ్చేందుకు నిరాకరించారని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. నానో డీఏపీతో కలిపే యూరియా విక్రయిస్తానంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని రైతులు వాపోయాడు.
రైతుల ఇబ్బందులు పట్టించుకునేదెవరు?
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి ఫర్టిలైజర్లో నిత్యం యూరియాతో పాటు నానో డీఏపీని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. తమ ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
Bigg Boss 10 | మాజీ కంటెస్టెంట్లతో హౌస్లో హీటెక్కిన నామినేషన్లు.. ముకేష్పై త్రిగుణ్ ఫైర్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
Satvika Veeravalli | చూపు తిప్పుకోనివ్వని అందం.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి ఫొటోలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
Vote for Note | ఓటుకు నోటు కేసు 25కు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

