‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల విధానం, ఓటు హక్కు, ఓటు ప్రాముఖ్యత తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) లో...
– నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
– ఓటరు ప్రక్రియపై జిల్లా స్థాయి పోటీల నిర్వహణ
– రాష్ట్రస్థాయిలోనూ బహుమతులు సాధించాలని సూచన
రామగిరి, నవంబర్ 18 : ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల విధానం, ఓటు హక్కు, ఓటు ప్రాముఖ్యత తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) లో ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలను కలెక్టర్ పరిశీలించారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
ఎన్నికల ప్రక్రియలో ఓటరు నమోదు, నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రచారం, పోలింగ్ వంటి వివిధ దశలు ఉంటాయని, బ్యాలెట్ పేపర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ద్వారా ఎన్నికలు నిర్వహించే విధానం, ఈవీఎంల పనితీరు, వాటి రూపకల్పన, భద్రతా విధానాలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి వివరించారు. బ్యాలెట్ పేపర్తో పోలిస్తే ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తవుతుందని తెలిపారు. దేశ ఎన్నికల విధానాన్ని పరిశీలించేందుకు ఇటీవల 18 దేశాల ప్రతినిధులు వచ్చి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థులు చదువుతో పాటు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ కె.నరసింహ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

