Met Gala | మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా (Priyanka Chopra), దీపిక పదుకొణె (Deepika Padukone), ఈషా అంబానీ (Isha Ambani), అలియా భట్ (Alia Bhatt) తదితర నటీనటులు హాజరై సందడి చేశారు.
ఈ ఏడాది కూడా మెట్ గాలా న్యూయార్క్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మే 6న ప్రారంభమైన ఈ వేడుకలో భారత్ నుంచి ఈసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల కుమార్తె ఈషా అంబానీ, బాలీవుడ్ స్టార్ నటి అలియా హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో అలియా.. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఫ్లోరల్ శారీలో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు. ఈ శారీలో అలియా ఎంతో అందంగా కనిపించింది.
ఇక ఈషా అంబానీ సైతం ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్ గౌనును ధరించి మెరిసిపోయారు. ఈ గౌనును పూల ఫాంటసీతో ప్రత్యేకంగా రూపొందించారు. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగలు వంటి బొమ్మలతో ఈ గౌనును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ గౌను తయారీకి దాదాపు 14 నెలల సమయం పట్టింది. ఇక మెట్ గాలాలో అలియా, ఈషా మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read..
Lok Sabha Elections | రెండు గంటల్లో పది శాతం పోలింగ్.. రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం ఇలా
PM Modi | ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం: ప్రధాని మోదీ
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలు.. కొనసాగుతున్న మూడో విడుత పోలింగ్