Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలు.. కొనసాగుతున్న మూడో విడుత పోలింగ్
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు. ఈ విడుతలో 11 రాష్ర్టాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓట్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ-అనంత్ నాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని ఆరో విడతకు మార్చారు. మధ్యప్రదేశ్‌లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిసున్నారు. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ 283 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది.
ఏ రాష్ట్రంలో ఎన్నంటే..
గుజరాత్లో ఇండోర్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా, తక్కిన 25 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్రలో 11, యూపీ 10, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్ 7, బీహార్ 5, అస్సాం, పశ్చిమబెంగాల్లో నాలుగు చొప్పున, గోవా 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగనున్నది.
పోటీలో ప్రముఖులు
కేంద్ర మంత్రులు అమిత్‌షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్షుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్ జోషీతోపాటు అఖిలేశ్‌యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, సుప్రియాసూలే తదితర ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు.
బీజేపీకి పరీక్ష
మూడో విడత ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన గుజరాత్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్ లోక్‌సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్‌స్కాండల్ ఆరోపణలు, గుజరాత్లో బీజేపీపై రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో బీజేపీకి ఈ దశ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో ఈ విడత ఎన్నికలు జరిగే 14 సీట్లనూ గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకున్నది. అయితే ప్రజ్వల్ వ్యవహారం నేపథ్యంలో ఈసారి సీట్లకు భారీ కోత పడే అవకాశం ఉన్నది. గత ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా, ఈసారి రాజ్‌పుత్‌ల వ్యతిరేకత ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

