త్యాగాలతో తెచ్చుకున్న స్వరాష్ట్రం
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే ఉద్యమ నాయకుడి భీషణ ప్రతిజ్ఞ ముక్కోటి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చింది, ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. స్వరాష్ర్టాన్ని సాకారం చేసింది. తరతరాల అన్యాయాలు, అవమానాలు, దోపిడీలకు చరమగీతం పాడింది. స్వరాష్ట్ర సాధనోద్యమంలో చరిత్రాత్మకమైన 2009 నవంబర్ 29 దీక్షా దివస్ ఒక మహత్తర ఘట్టం. హైదరాబాద్ ఫ్రీజోన్ అని 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునివ్వగా, రాష్ట్రపతి ఉత్తర్వులు, ముల్కీ రూల్స్‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు, ఉద్యోగసంఘాలు, మేధావుల ఆందోళనతో పోరు మొదలైంది.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే ఉద్యమ నాయకుడి భీషణ ప్రతిజ్ఞ ముక్కోటి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చింది, ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. స్వరాష్ర్టాన్ని సాకారం చేసింది. తరతరాల అన్యాయాలు, అవమానాలు, దోపిడీలకు చరమగీతం పాడింది. స్వరాష్ట్ర సాధనోద్యమంలో చరిత్రాత్మకమైన 2009 నవంబర్ 29 దీక్షా దివస్ ఒక మహత్తర ఘట్టం. హైదరాబాద్ ఫ్రీజోన్ అని 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునివ్వగా, రాష్ట్రపతి ఉత్తర్వులు, ముల్కీ రూల్స్‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు, ఉద్యోగసంఘాలు, మేధావుల ఆందోళనతో పోరు మొదలైంది.
హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యవహారంపై తెలంగాణ యావత్తు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో 2009 అక్టోబర్ 19న ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. రాజ్యాంగ సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగింది. 610 జీవోను అమలు చేయాలని, హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా పరిగణించే 14-ఎఫ్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ 2009 అక్టోబర్ 28న జైల్ భరో కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన నిరసనలో కేసీఆర్ అరెస్టయ్యారు. మరుసటి రోజు కీలక ప్రకటన చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి సిద్దిపేటకు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను ప్రభుత్వ పెద్దల ఆదేశంతో పోలీసులు అలుగునూరు వద్ద అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది. తెలంగాణలో ఊరూరా పోరు రాజుకున్నది. యూనివర్సిటీలు రణక్షేత్రాలయ్యాయి. విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటికి నిప్పంటించుకున్నాడు. దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాలనే డిమాండ్‌తో యువకులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడింది. అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులతో ఉద్యమకారులపై లాఠీచార్జీలు, భాష్పవాయు గోళాల ప్రయోగాలు, కాల్పులు జరిపింది. యూనివర్సిటీల గేట్లను మూసివేసి దిగ్బంధించింది. కేసీఆర్ దీక్షను విరమింపజేయడానికి ప్రయత్నాలు చేసింది. దీక్ష విరమించారంటూ దుష్ప్రచారం చేసింది. ఆ పన్నాగాలన్నింటినీ అధిగమిస్తూ కేసీఆర్ దీక్షను కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించింది. తెలంగాణలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2009 డిసెంబర్ 7న సచివాలయంలో రోశయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తొమ్మిది రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ప్రజాగ్రహం రోజురోజుకూ పెరిగి, కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీవ్రమైంది. కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో వారు బయట తిరుగలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కేసీఆర్ దీక్ష, మరోవైపు మద్దతుగా సకల జనుల నుంచి నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్రం తెలంగాణ అంశాన్ని పరిష్కరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ పలుమార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఇదే సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరుకున్నది. కేసీఆర్‌కు ఏమైనా అపాయం జరిగితే కంట్రోల్ చేయలేమని కేంద్రానికి స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. చివరకు 9 డిసెంబర్ 2009 అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని, అందులో భాగంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత కేసీఆర్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పండ్లరసం ఇచ్చి, నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో యావత్తు తెలంగాణలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆ తర్వాత డిసెంబర్ 23న కేంద్రం వెనక్కి వెళ్లింది. ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఆందోళనతో విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. కేసీఆర్ సంకల్పం, దిశానిర్దేశం, సకల జనుల పోరాటంతో 2014 జూన్ 2న చిరకాల స్వప్నం సాకారమైంది.
( వ్యాసకర్త: శాసనమండలిలో ప్రతిపక్షనేత)
సిరికొండ మధుసూదనాచారి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

