ఇక కష్టమే..
టాపార్డర్ తడబాటు, రిషబ్ పంత్ బాధ్యతారాహిత్య ఆటతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ఆకాశ్ దీప్ (5/99) ఐదు వికెట్లతో మెప్పించినా మిగతా బౌలర్లు నిరాశ పరచడంతో ప్రత్యర్థికి భారీ స్కోరుకు ఇచ్చుకున్న టీమిండియా బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. శనివారం, రెండో రోజు ఆట చివరకు 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలు పెట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) సున్నా చుట్టగా..
- 116/6తో భారత్ ఎదురీత
- నిరాశపరిచిన టాపార్డర్
- తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 356 ఆలౌట్
- రాణించిన బ్లండెల్
- ఆకాశ్‌కు ఐదు వికెట్లు
వెల్లింగ్టన్: టాపార్డర్ తడబాటు, రిషబ్ పంత్ బాధ్యతారాహిత్య ఆటతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ఆకాశ్ దీప్ (5/99) ఐదు వికెట్లతో మెప్పించినా మిగతా బౌలర్లు నిరాశ పరచడంతో ప్రత్యర్థికి భారీ స్కోరుకు ఇచ్చుకున్న టీమిండియా బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. శనివారం, రెండో రోజు ఆట చివరకు 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలు పెట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) సున్నా చుట్టగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (17), దేవ్‌దత్ పడిక్కల్ (21) నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ (80 బంతుల్లో 25) పోరాడినా కీలక దశలో పంత్ (23) నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకోవడం జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
ప్రస్తుతం ధ్రువ్ జురెల్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో నాలుగు వికెట్లే ఉండగా.. ప్రత్యర్థి స్కోరుకు భారత్ ఇంకా 240 పరుగుల వెనుకంజలో ఉంది. చివరి వరుస బ్యాటర్లతో కలిసి జురెల్ ధాటిగా ఆడితేనే గిల్‌సేన ఓటమి తప్పించుకోగలదు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 356 పరుగులకు ఆలౌటైంది. టామ్ బ్లండెల్ (211 బంతుల్లో 10 ఫోర్లతో 89) జట్టుకు మంచి స్కోరు అందించాడు. గుర్నూర్ బ్రార్ (2/78), అన్షుల్ కాంబోజ్ (2/79) చెరో రెండు వికెట్లు పడగొట్టినా పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా (0/49) ఖాతా తెరువలేకపోయాడు.
టాపార్డర్ తడబాటు
హాగ్లే ఓవల్ పిచ్‌పై సీమ్ కదలికతో పాటు అసౌకర్యకరమైన బౌన్స్ భారత టాపార్డర్‌ను దెబ్బతీసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్.. మ్యాట్ హెన్రీ (1/29) అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దేవ్‌దత్ పడిక్కల్ వరుస బౌండరీలతో జోరు చూపినా, ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల కైల్ జేమీసన్ (2/33) బౌలింగ్‌లో తొందరపాటు షాట్ ఆడి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (17) కుదురుకున్నా టీ విరామానికి ముందే జేమీసన్ బంతికి పెవిలియన్ చేరాడు. ఈ దశలో తొలి టెస్ట్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ దాదాపు రెండు గంటలు క్రీజులో నిలిచినా డఫీ (2/21) వేసిన ఊరించే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి కాన్వేకు క్యాచ్ ఇచ్చాడు. ఆట ముగిసే ముందు నేథన్ స్మిత్ (1/29) బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (60 బంతుల్లో 10) కూడా వెనుదిరగడంతో భారత కష్టాలు రెట్టింపయ్యాయి.
పంత్ మళ్లీ అదే తప్పు..
భారత్ కోల్పోయిన ఆరు వికెట్లలో పంత్ ఔటైన తీరు చర్చనీయాంశమైంది. 59 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరిన క్లిష్ట దశలో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన పంత్ బాధ్యతకు, నిర్లక్ష్యానికి మధ్య గీతను దాటి మరోసారి మూల్యం చెల్లించుకున్నాడు.రాహుల్‌తో కలిసి క్రీజులో కుదురుకున్న తర్వాత కూడా నిర్లక్షమైన షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్స్ బాదిన అతను బేసిన్ రిజర్వ్‌తో పోలిస్తే హాగ్లే ఓవల్ పిచ్‌పై అదనపు బౌన్స్ ఉన్న విషయాన్ని విస్మరించాడు. డఫీ బంతికి క్రీజు వదిలి ముందుకొచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించగా, టెన్నిస్ బాల్లా గాల్లోకి లేచిన బంతిని జేమీసన్ సులువుగా క్యాచ్ పట్టాడు. గతేడాది గువాహటిలో మార్కో యాన్సెన్ బౌలింగ్‌లోనూ పంత్ ఇదే తరహాలో ఔటయ్యాడు.
బ్లండెల్ పోరాటం.. ఆకాశ్ పాంచ్ పటాకా
తొలుత ఓవర్‌నైట్ స్కోరు 246/5తో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు జత చేయకుండానే ఫిలిప్స్ (36) కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, తొలి రోజు జోరును కొనసాగించిన బ్లండెల్.. నేథన్ స్మిత్ (26) సహకారంతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్మిత్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చిన ఆకాశ్ దీప్ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీశాడు. అయినా కైల్ జేమీసన్( 19)తో కలిసి బ్లండెల్ 330/8తో జట్టును లంచ్‌కు తీసుకెళ్లాడు. అయితే విరామం నుంచి వచ్చిన వెంటనే జేమీసన్‌ను ఆకాశ్ ఔట్ చేయగా.. శతకం దిశగా సాగుతున్న బ్లండెల్‌ను బ్రార్ వెనక్కుపంపాడు. ఇక, భారత ఫీల్డర్లు మూడుసార్లు (పడిక్కల్ రెండు, బ్రార్ ఒకటి) క్యాచ్ డ్రాప్‌లతో బతికిపోయిన హెన్రీ (19) చివర్లో విలువైన పరుగులు జోడించాడు. స్కోరు 350 దాటిన తర్వాత అతడిని ఆకాశ్ వికెట్‌గా ఔట్ చేసి ఐదు వికెట్ల హాల్ సాధించాడు.
89 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధికంగా 89 సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (64 టెస్టుల్లో 88 సిక్సర్లు) పేరిట ఉన్న రికార్డును పంత్
44 టెస్టుల్లోనే బద్దలుకొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 116.3 ఓవర్లలో 356 ఆలౌట్ ( బ్లండెల్ 89, టామ్ లాథమ్ 59, ఆకాశ్ దీప్ 5/99). భారత్ తొలి ఇన్నింగ్స్: 46 ఓవర్లలో 116/6 (రాహుల్ 25, డఫీ 2/21)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

