గులాబీ దళంపై కేసుల పంజా
ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లుంది.. బావర్చి హోటల్లో కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు. అయితే వారిని వదిలేసి.. పోలీసులు బీఆర్ఎస్ వారిపై ఏకపక్షంగా కేసులు పెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్లో ఈనెల 26న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలను వదిలేసి..
- బావర్చి ఘటనలో ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు
- మన్నె క్రిశాంక్‌తో పాటు పలువురు నేతలపై కేసు నమోదు
- బంగారం చోరీ అయిందంటూ.. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లుంది.. బావర్చి హోటల్లో కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు. అయితే వారిని వదిలేసి.. పోలీసులు బీఆర్ఎస్ వారిపై ఏకపక్షంగా కేసులు పెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్లో ఈనెల 26న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలను వదిలేసి.. బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారు. నిరుద్యోగులకు మూడేండ్ల కిందట ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి బీఆర్ఎస్ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సందర్భంలో రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ తన అనుచరులతో కలిసి వచ్చి హోటల్లో వీరంగం సృష్టించారు. కాంగ్రెస్ నేతలు దాడులు చేసే వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయినప్పటికీ పోలీసులు వాటిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇన్చార్జీ మన్నెక్రిశాంక్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు, అడిగ్మెట్కు చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటతేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 118(1), 352, 191(3), 190 కింద కేసు నమోదు చేశారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ చిత్రపటంతో బీఆర్ఎస్ నేతలు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారిని అడ్డుకునేందుకు వెళ్లిన తమపై దాడికి పాల్పడ్డారని వెంకటతేజ తన ఫిర్యాదు చేశారు. హోటల్లో లైట్లు ఆఫ్ చేసి మరీ దాడి చేశారని, ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకులకు చెందిన సుమారు పది తులాల బంగారం చోరీకి గురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటతేజ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలేసి దాడికి గురైన వారిపై కేసులు నమోదు చేయడం రేవంత్ సర్కారుకే చెల్లిందంటూ.. బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీ పుటేజ్ ఆధారంగా ఘర్షణకు దారితీసిన పరిస్థితు లు, దాడి ప్రతిదాడులు, బంగారం చోరీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఉన్నతాధికారుల సూచనల మేరకే తాము కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు చేయకపోవడానికి కారణాలేంటని పోలీసు అధికారులను అడిగితే వారు సమాధానాన్ని దాటవేయడం గమనార్హం. ఘటనకు సంబంధించిన ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నా.. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వదిలేస్తున్నారంటూ దీనివెనక అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ చెబుతోంది. కేసు నమోదు చేసిన రేవంత్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ కేసులో మన్నెక్రిశాంక్, ముఠా
జైసింహ, జగన్, దినేష్‌చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి, హరీష్రెడ్డిలను అరెస్టు చేయవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

