డీలిమిటేషన్ కమిషన్‌లో జ్ఞానేశ్ వద్దు
జ్ఞానేశ్ కుమార్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీ నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయన మీద విమర్శలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ కమిషన్లోనూ జ్ఞానేశ్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండనున్నారు.
- ఇక ‘సీట్ల చోరీ’ చేస్తాడని ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ : జ్ఞానేశ్ కుమార్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీ నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయన మీద విమర్శలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ కమిషన్లోనూ జ్ఞానేశ్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండనున్నారు. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆయన ఉంటే సీట్లచోరీ చేస్తారని విమర్శిస్తున్నాయి.
ఇప్పటికే రాహుల్ గాంధీ జ్ఞానేశ్‌ను కమిషన్‌లో నియమించొద్దు అంటూ మండిపడ్డారు. జ్ఞానేశ్ తన స్థానంలో మరో కమిషనర్‌ను నామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. దీన్నే ప్రతిపక్షాలు తెరమీదకు తెస్తూ వేరే కమిషనర్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. అయితే బీజేపీ, ఎన్నికల సంఘం మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబడుతున్నాయి. గెలవడం చేతకాకే ఇలాంటి ఆరోపణలు అంటూ బీజేపీ లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

