కొడంగల్‌లో 60 కోట్ల భూస్కామ్
- ప్రజాపాలన పేరిట పట్టపగలే ముఖ్యమంత్రి దోపిడీ
- కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకే గ్రోత్ కారిడార్
- సీఎం కు భయపడ్తున్న విజిలెన్స్ డీజీ
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి పట్టపగలే దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు గ్రోత్ కారిడార్ పేరిట కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో 300 ఎకరాల భూమి ఉంటే 500 ఎకరాలున్నట్టు రికార్డులు సృష్టించి రూ.60 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. 252/10 సర్వేనంబర్‌లో ఒక వ్యక్తికి మూడెకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా 32 బై నంబర్లు సృష్టించి 70 ఎకరాలున్నట్టు చూపి, కాంగ్రెస్‌కు చెందిన 32 మందికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అండదండలతోనే ఆయన నియోజకవర్గంలో భారీ స్కామ్‌కు తె రతీశారని ప్రవీణ్ విరుచుకుపడ్డారు.
శనివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూసేకరణ చేయాలంటే కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్లు మోకా మీదికి వెళ్లి పరిశీలించాక అర్హులను గుర్తించి పరిహారమిస్తారని, కానీ ఇక్కడ అధికారులు నిబంధనలు పాటించకుండా రేవంత్ చెప్పినట్టు కాంగ్రెస్ నేతల జేబులు నింపుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మె ల్యే నరేందర్‌రెడ్డి కలెక్టర్, ఎస్సీ వద్దకు వెళ్లినా న్యాయం జరుగలేదని, విజిలెన్స్ డీజీపీని కలిసేందుకు శనివారం వెళ్లగా అప్పటికే వెళ్లిపోయారని చెప్పారు. రేవంత్‌కు భయపడే వినతిపత్రం తీసుకొనేందుకు నిరాకరించారని ప్రవీ ణ్ ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామని అయినా న్యాయం జరుగకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు.
దాడికి గురైన వారిపై కేసులు దుర్మార్గం
బావర్చిలో కాంగ్రెస్ నాయకులు కుర్చీలు, బల్లలు విసిరేసి వీరంగం సృష్టిస్తే, దాడికి గురైన బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజమెత్తారు. పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తి ఆక్షేపణీయమని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు భయపడే బావర్చి యజమానులు ఫిర్యా దు చేసేందుకు జంకుతున్నారని పేర్కొన్నారు.
కమీషన్లు తీసుకొని బినామీలకు పరిహారం: పట్నం మహేందర్‌రెడ్డి
50శాతం కమీషన్ తీసుకొని అసలు రైతులకు కాకుండా బినామీలకు పరిహారం ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో భూదోపిడీపై ఫిర్యాదు చేసేందుకు మూడు రోజుల క్రితం విజిలెన్స్ డీజీ అపాయింట్మెంట్ తీసుకున్నామని, శనివారం తాము వస్తున్నామని తెలియగానే ఆఫీసు నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు భ యపడే ఫిర్యాదు తీసుకోలేదని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపి ఎమ్మార్వో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే సీఎం దీపావళి రోజున మూడు రోజులు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మూడు సభలు నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే పట్నం దెప్పిపొడిచారు. కేసీఆర్ హయాంలో ‘పాలమూరు-రంగారెడ్డి’కి రూ.28వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కానీ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

