ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్
ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేసిన పోరాటం.. వందలాది మంది అమరుల త్యాగాలు.. లక్షలాది మంది ప్రజల ఉద్యమాలు.. వెరసి కేంద్రం మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం!. దశాబ్దాల పోరాట చరిత్రను, రాష్ట్ర సాధనలో కీలక ఘట్టాలను, త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది.
- ప్రాణాలకు తెగించి కేసీఆర్ ఆమరణ దీక్ష
- నాటి ఉద్యమ స్ఫూర్తి.. నేటితరానికి మార్గదర్శకం
- ప్రజా చైతన్యంతోనే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ
- తెలంగాణ చరిత్రను కనుమరుగుచేసే కుట్రలు
- నేడు కరీంనగర్ గడ్డపై దీక్షా దివస్ స్ఫూర్తి సభ
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు
కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేసిన పోరాటం.. వందలాది మంది అమరుల త్యాగాలు.. లక్షలాది మంది ప్రజల ఉద్యమాలు.. వెరసి కేంద్రం మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం!. దశాబ్దాల పోరాట చరిత్రను, రాష్ట్ర సాధనలో కీలక ఘట్టాలను, త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటాలను మరుగునపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో.. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు మరో ప్రజా చైతన్యం అవసరమనే చర్చ మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఏటా దీక్షా దివస్ నిర్వహిస్తున్నప్పటికీ.. ఈసారి భారీ ఎత్తున స్ఫూర్తి సభకు బీఆర్ఎస్ సిద్ధమవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నాటి ఉద్యమ చరిత్రను గుర్తుచేయడంతోపాటు నేటి తెలంగాణకు ఎదురవుతున్న సవాళ్లు, నీళ్లు, నిధులు, హక్కుల అంశాలపై ప్రజలను చైతన్యపరిచే దిశగా ఈ సభ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నదన్నది ఆసక్తికరంగా మారింది.

మలుపు తిప్పిన రోజు
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కీలక ఘట్టం.. ఉద్యమానికి ఊపిరిపోసిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు.. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణ.. 12 ఏండ్ల తర్వాత మరోసారి ఉద్యమ చరిత్రపై చర్చ.. భావితరాలకు పోరాట స్ఫూర్తిని అందించడమే లక్ష్యంగా నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ స్ఫూర్తిసభను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష సాధించేందుకు నాడు సాగిన పోరాటాలే కాదు, నేటి పరిస్థితులను కూడా ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతున్నది.
నిజానికి తెలంగాణ చరిత్రలో 2009 నవంబర్ 29 ఒక మరిచిపోలేని రోజు! ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఆ రోజు కొత్త ఊపిరి పోసింది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా ఆకాంక్షలు.. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది.
ఆయన అరెస్టు, ఖమ్మం జైలులో దీక్ష కొనసాగింపు, ఆరోగ్యం క్షీణించి నిమ్స్‌కు తరలింపు.. ఆ పరిణామాలతో తెలంగాణవ్యాప్తంగా పెల్లుబికిన ప్రజాగ్రహం కేంద్రాన్ని కదిలించింది. చివరకు డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించాల్సి వచ్చింది. అందుకే నవంబర్ 29ని దీక్షా దివస్‌గా గుర్తుచేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయిన తరుణంలోనూ నవంబర్ 29కి ప్రాధాన్యం తగ్గలేదు. నాటి పోరాట చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం అవసరమనే సందేశంతో బీఆర్ఎస్ ఆదివారం దీక్షా దివస్ స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నది.

Brs
చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత
రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో పాల్గొన్న ఒక తరం ఇప్పుడు జీవితంలోని మరో దశలోకి వెళ్లింది. ఉద్యమ సమయంలో పుట్టని వారు, అప్పటికి చిన్న పిల్లలుగా ఉన్నవారు నేడు యువతగా ఎదిగారు. వారికి తెలంగాణ రాష్ట్రం సహజంగా లభించిన రాజకీయ వాస్తవంలా కనిపించవచ్చు. కానీ, ఆ రాష్ట్రం వెనుక ఉన్న దశాబ్దాల పోరాటం, విద్యార్థుల త్యాగా లు, ప్రజల నిరసనలు, కేసీఆర్ దీక్ష, కేంద్రంతో సాగిన రాజకీయ పోరాటం గురించి పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దీక్షా దివస్‌ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, తెలంగాణ ఉద్యమ చరిత్రను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా నిర్వహించాలని భావిస్తున్నది. ఉద్యమ చరిత్రలో కేసీఆర్‌తోపాటు విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాన్య ప్రజల పాత్రను కూడా చరిత్రలో నమోదు చేయాలి. గత ప్రభుత్వాల నిర్ణయాలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, వాటి ప్రభావాలను ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండాలి. చరిత్రపై చర్చను రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేయకుండా పరిశోధనాత్మకంగా కొనసాగించాలి.
నాటి స్ఫూర్తి.. నేటితరానికి మార్గదర్శకం
నవంబర్ 29ని గుర్తుచేసుకోవడం అంటే కేసీఆర్ చేపట్టిన దీక్షను మాత్రమే స్మరించుకోవడం కాదు. తెలంగాణ సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటాన్ని, అమరుల త్యాగాలను, ప్రజల సమష్టి కృషిని మరోసారి గుర్తుచేసుకోవడం. నాటి తరానికి ఉద్యమం ప్రత్యక్ష అనుభవం కాగా.. నేటి తరానికి అది తెలుసుకోవాల్సిన చరిత్ర. ఆ చరిత్ర నుంచి ప్రజాస్వామ్య పోరాట విలువలను, ఐక్యతను, హక్కుల కోసం ప్రశ్నించేతత్వాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దీక్షా దివస్ స్ఫూర్తి సభ ద్వారా బీఆర్ఎస్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియాలో దీక్షా దివస్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉన్నదని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు అనిల్ బైరెడ్డి అన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకొని ఆస్ట్రేలియాలో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. అలుగునూర్‌లో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ
దీక్షతోనే తెలంగాణ సాకారం
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్‌కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్ బొలిశెట్టి తెలిపారు. శనివారం బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అన్నారం సుమన్, కార్యదర్శి ఉత్కం కిరణ్‌గౌడ్, సంగేపు దేవన్న తదితరులు పాల్గొన్నారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

