దోషికి శిక్ష తగ్గించే ముందు
ఏదైనా కేసులో దోషికి కోర్టు విధించిన శిక్షా కాలం పూర్తి కాకమునుపే ఆ వ్యక్తిని విడుదల చేయడానికి లేదా శిక్ష తగ్గింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే, అంతకుముందు ఆ కేసులో బాధితులు లేదా వారి న్యాయ ప్రతినిధులు తమ వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది.
- బాధితుల వాదన వినాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఏదైనా కేసులో దోషికి కోర్టు విధించిన శిక్షా కాలం పూర్తి కాకమునుపే ఆ వ్యక్తిని విడుదల చేయడానికి లేదా శిక్ష తగ్గింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే, అంతకుముందు ఆ కేసులో బాధితులు లేదా వారి న్యాయ ప్రతినిధులు తమ వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. నేర న్యాయ విచారణలో భాగస్వామి అయ్యే హక్కు బాధితునికి ఉందని, ఆ హక్కు విచారణ ముగియడంతో లేదా శిక్ష విధింపుతో ముగిసిపోదని పేర్కొంది.
ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యే బాధితులకు ప్రభుత్వ నిర్ణయంపై వీటో అధికారం ఉండదని పేర్కొంది. మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను శిక్షా కాలం ముగియక మునుపే విడుదల చేయాలన్న బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 26న ఈ రూలింగ్ ఇచ్చింది.
దీంతో ఉదయించిన మరొక ప్రశ్న ఏమిటంటే, దోషులు తమ శిక్షను సస్పెండ్ చేసి, బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపే కోర్టులు కూడా ఆయా కేసుల్లోని బాధితులకు తమ వాదన వినిపించే హక్కు ఉంటుందా? గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు దోషులకు గతంలో విధించిన శిక్షను సుప్రీంకోర్టు గత నెల 28న సస్పెండ్ చేసింది. వీరు 17 ఏండ్లు జైలు జీవితాన్ని గడిపారని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా రూలింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

