డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
డీలిమిటేషన్ బిల్లుకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్న బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే 12 ఏండ్లు ఆలస్యమైందని తెలిపారు.
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ బిల్లుకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్న బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే 12 ఏండ్లు ఆలస్యమైందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మహిళా రిజర్వేషన్లను బీఆర్ఎస్ మొదటి నుంచీ సమర్థిస్తున్నదని, మహిళలు, బీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. రాజ్యసభ సీట్ల సంఖ్యను కూడా పెంచాలని, అక్కడా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

