హెచ్ఎండీఏ కమిషనర్‌గా నర్సింహారెడ్డి
- మెట్రో రైల్ ఎండీగా అజిత్‌రెడ్డి
- పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ నూతన కమిషనర్‌గా ఈవీ నర్సింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కమిషనర్ స ర్ఫరాజ్ అహ్మద్‌ను బదిలీ చేసింది. మూ సీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సంజయ్ జాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా ఉన్న అజిత్‌రెడ్డిని మెట్రోరైల్ ఎండీగా నియమించింది.
హెచ్ఎండీఏ(లిమిట్స్) కమిషనర్ సర్ఫరాజ్ అ హ్మద్ను హెచ్ఎండీఏ కార్యదర్శిగా, మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా మయాంక్ మిట్టల్‌ను(ఎఫ్ఏసీ) నియమించింది. శంషాబాద్ జోన ల్ కమిషనర్ చంద్రకళ హెచ్ఎండీఏ జా యింట్ కమిషనర్‌గా(కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్) నియమించింది. మంచిర్యాల సబ్ కలెక్టర్ మనోజ్ ను మెట్రోరైల్ జాయింట్ ఎండీగా నియమించింది. స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ రామును విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్(ప్రాజెక్ట్స్)గా నియమించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

