లాస్ ఏంజెల్స్, మే 7: వినియోగదారులకు మ్యాప్‌లు మరింత మెరుగ్గా కనిపించేలా ‘మ్యాప్స్’ యాప్‌ను గూగుల్ రీడిజైన్ చేస్తున్నది. ఇందులో భాగంగా కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నది. ఇప్పటివరకు మనం మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాన్ని సెర్చ్ చేసినప్పుడు, దానికి సంబంధించిన మ్యాప్‌తో పాటు ఫొటోలు, సమాచారం కూడా కనిపిస్తున్నది.
సగం స్క్రీన్‌లో ఇవే ఉండటం వల్ల మ్యాప్ సరిగ్గా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మ్యాప్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా డిజైన్ చేస్తున్నది. పాప్అప్, మెనూ వంటివి ఏవీ మ్యాప్‌కు అడ్డుగా రాకుండా, మ్యాప్‌లు స్పష్టంగా కనిపించేలా మారుస్తున్నది. ఇక, ఇప్పటివరకు ఎక్కడికైనా వెళ్లేందుకు స్టార్టింగ్ లొకేషన్, డెస్టినేషన్ అడ్రస్ ఎంటర్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉండేది. ఇక మీదట అడ్రస్ ఎంటర్ చేస్తున్నప్పుడే కింద డ్రైవింగ్, ప్రజా రవాణా, వాకింగ్, టాక్సీ, సైకిల్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.