కుభీర్ : మండల కేంద్రం కుభీర్‌తో పాటు పలు గ్రామాలల్లో హనుమాన్ జయంతి ( Hanuman Jayanti ) ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుభీర్‌లో 25 అడుగుల ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు.
ఈ సందర్భంగా భజనలు, మేళతాళాలతో శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది, అంజన్న నామస్మరణతో పాటు శ్రీరామనామ నామస్మరణతో గ్రామాలు దద్దరిల్లాయి. యువకులు కాషాయ వస్త్రాలు ధరించి వీధుల గుండా కాషాయ జెండాలను ఎగురవేశారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
శోభాయాత్రలో బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సముద్రాల వేణుగోపాల చారి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్, మాజీ మార్కుఫెడ్ డైరెక్టర్ రేకుల గంగా చరణ్, నాగభూషణ్ (మణి),మండల నాయకులు, యువకులు, పాల్గొన్నారు.