పాట్నా: తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ ఆరోపించింది. అయితే పంచాయతీ పెద్దలు ఆమెను బహిరంగంగా శిక్షించారు. ఆ మహిళతో పాటు నిందితుడితో బలవంతంగా ఉమ్మి నాకించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Woman forced to lick spit) బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 2న రాత్రి వేళ పొరుగింటి వ్యక్తి బలవంతంగా ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అతడ్ని పట్టుకున్నారు.
కాగా, ఈ సంఘటనపై గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. ఆ మహిళతో పాటు నిందితుడైన ఆ వ్యక్తిని బహిరంగంగా శిక్షించారు. చెవులు పట్టుకుని నిల్చొన్న ఆ మహిళ ఆ తర్వాత కిందకు వంగి నేలపై ఉన్న ఉమ్మిని నాకింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని కూడా జనం సమక్షంలో చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పించి, ఉమ్మిని నాకించేలా చేశారు.
మరోవైపు ఈ అమానుష సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ జూలై 31న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఆగస్ట్ 1న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళకు, నిందితుడి మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని గ్రామస్తులు ఆరోపించారు. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో పట్టుబడినట్లు విమర్శించారు.
#Bihar शादीशुदा रेप पीड़िता को पंचायत में थूक के चटवाया गया। पीड़िता का आरोप है कि मेरी गलती नहीं होने के बावजूद पंचायत ने दबाव बनाकर मुझसे जबरदस्ती जमीन पर थूक चटवाया। मामला बिहार के बेगूसराय का है। #Begusarai #BegusaraiNews #Viralnews #Dainikbhaskar pic.twitter.com/5rwzClcD1k
— Ashutosh Prasad (@ashukrpd) August 2, 2026