Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Asaduddin Owaisi | ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరప్రదేశ్ పోలీసులు పొరబడ్డారు. దీంతో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
లక్నో: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరప్రదేశ్ పోలీసులు పొరబడ్డారు. దీంతో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. (Asaduddin Owaisi) ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), ఏఐఎంఐఎం నిర్ణయించాయి.
కాగా, శనివారం సంయుక్త మీడియా సమావేశం కోసం ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత చంద్రశేఖర్ ఆజాద్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి సహారన్పూర్ చేరుకున్నారు. అయితే అక్కడి సర్క్యూట్ హౌస్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందర్శించనుండటంతో పోలీసులు ‘గార్డ్ ఆఫ్ హానర్’ కోసం సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో అసదుద్దీన్ ఒవైసీ అనుకోకుండా అక్కడకు చేరుకోవడంతో ఆయనను సుప్రీంకోర్టు జడ్జిగా పోలీసులు పొరబడ్డారు. ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా లేచి నిల్చొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. అధికారిక గౌరవ వందనం ఎవరి కోసం ఏర్పాటు చేశారో అన్నది గుర్తించడంలో జరిగిన లోపంపై విచారణకు ఆదేశించారు. ‘విచారణలో సేకరించిన వాస్తవాలు, సాక్ష్యాధారాల ఆధారంగా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని సహారన్పూర్ ఎస్ఎస్పీ తెలిపారు.
Saharanpur, Uttar Pradesh: AIMIM chief Asaduddin Owaisi was given a Guard of Honour at the Circuit House instead of a Supreme Court judge, who was supposed to receive it https://t.co/osoxpkB8Gn
— IANS (@ians_india) November 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

