Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Harasses Sleeping Woman In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగి పక్కన నేలపై నిద్రిస్తున్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె దుప్పటిలోకి దూరి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మేల్కొన్న ఆమె అతడి చెంపపై కొట్టింది.
బెంగళూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగి పక్కన నేలపై నిద్రిస్తున్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె దుప్పటిలోకి దూరి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మేల్కొన్న ఆమె అతడి చెంపపై కొట్టింది. ఆ వార్డులోని మిగతా వారు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. సీసీటీవీలో రికార్టైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Harasses Sleeping Woman In Hospital) కర్ణాటకలోకి హవేరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని వార్డులో ఒక పేషెంట్‌కు సహాయంగా ఉన్న మహిళ రాత్రి వేళ నేలపై నిద్రించింది.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక వ్యక్తి ఆ వార్డులోకి వచ్చాడు. నేలపై నిద్రిస్తున్న మహిళ దుప్పటిలోకి అతడు దూరాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మహిళ వెంటనే మేల్కొని కేకలు వేసింది. అతడి చెంపపై కొట్టింది. ఆ వార్డులోని మరికొందరు కూడా నిద్ర నుంచి మేల్కొన్నారు. ఆ వ్యక్తిని నిలదీశారు. అతడ్ని పట్టుకునేందుకు ఒకరు ప్రయత్నించగా తోసి పారిపోయాడు.
మరోవైపు గత వారం ఆ ఆసుపత్రిలో 10 మొబైల్ ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిని దొంగిలించిన వ్యక్తి కూడా అతడే అని అనుమానిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేశారు.
అయితే ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In a bizarre incident, an unidentified man allegedly entered a patient’s bed and attempted to steal her valuables while she was asleep at the Haveri District Hospital in the early hours of the 15th.
The incident took place around midnight in Ward No. 109, where patients suffering from leg fractures were being treated.
According to reports, the accused initially hid underneath the bed on which the woman was sleeping. He later quietly climbed onto the same bed and covered himself with the bedsheet. He allegedly slipped his hand inside the woman’s blouse in an attempt to steal her mobile phone and purse, which she had kept there.
However, the woman suddenly woke up and noticed the man’s suspicious movements. Shocked by the incident, she immediately slapped him. Startled by her resistance, the accused attempted to flee from the spot.
As other patients in the ward began waking up, the unidentified man escaped from the hospital premises.
The incident has caused concern among patients and their attendants, raising questions about security arrangements at the district hospital, where the safety of patients is expected to be ensured.
The entire incident was reportedly captured on the hospital’s CCTV cameras. The incident occurred within the jurisdiction of Haveri Town Police Station.
— Hate Detector 🔍 (@HateDetectors) November 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

