‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ఇటీవల సిద్దిపేట బహిరంగ సభలో హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆలేరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
– రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి హెచ్చరిక
ఆలేరు టౌన్, నవంబర్ 21 : ఇటీవల సిద్దిపేట బహిరంగ సభలో హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆలేరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటలో మాట్లాడిన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మీరు హరీశ్ రావును కడుగుతా అనడం కాదు.. ప్రజల కష్టాలను, రైతుల కష్టాలను, నిరుద్యోగుల కష్టాలను కడగాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కడగడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మీరు కేవలం కొడంగల్‌కు మాత్రమే ముఖ్యమంత్రిగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని హితవు పలికారు.
మేడిగడ్డను నింపకుండా నీటిని వృథాగా ఆంధ్రాకు పంపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. సాగర్ కు ఏపీ సర్కార్ కన్నం వేసి జలాశయం నుండి నేరుగా డెడ్ స్టోరేజీ నుండే నీటిని అక్రమంగా తరలించిపోయేందుకు గుట్టుగా సొరంగమే తవ్వుతుంటే కాంగ్రెస్ సర్కారు కుంభకర్ణుడి నిద్ర నటిస్తుందని ఆయన మండిపడ్డారు. తన రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం, తమ వ్యాపారాల కోసం, కుటుంబ బంధాల కోసం తొత్తులుగా మారి తెలంగాణ రాష్ట్రంలో చుక్క నీరు లేకుండా ఎడారిగా మార్చడానికి రేవంత్ పన్నాగం పన్నుతున్నాడని విమర్శించారు. ఆంధ్ర పాలకుల జలదోపిడిని నివారించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలోని అన్ని చెరువులు, కుంటలు నింపి రైతుల కళ్లలో ఆనందం చూస్తే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు సాగు చేయడానికి నీరు లేక, కరెంట్ లేక, పండించిన ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేయలేక అరిగోస పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి అనిచిత వ్యాఖ్యలు చేయడం కాదని, తనకు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేట నుండి పోటీ చేయాలని కల్లూరి సవాలు విసిరారు. ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గత 30 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులోనే ఉంచి కాంటాలు వేయకుండా కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మండల సెక్రెటరీ జనరల్ రస రామ నరసి, కౌన్సిలర్ ఆట శివ, నాయకులు పూల సెవెన్, పాకాల హరీష్, బీజాని మధు, కటకం మల్లేశం, ఎండి పాయా, సోషల్ మీడియా కన్వీనర్ వరిగాడి అశోక్, మాజీ సర్పంచ్ గిరిరాజు వెంకటయ్య, మాజీ సర్పంచ్ జూలుకుంట్ల రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
Double bedroom homes | నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ఎఫెక్ట్.. ‘డబుల్’ ఇళ్ల అక్రమ వసూళ్లపై వార్డు ఆఫీసర్ సస్పెన్షన్
Diabetes | డయాబెటిస్ ఉన్నవారు షుగర్ స్థాయిలను తగ్గించుకోవడమే కాదు, వీటిని కూడా గమనించాలి..
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
తుంగతుర్తిలో ఘనంగా మత్స్య కార్మికుల దినోత్సవం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

