Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పరిధిలోని మెట్టు బండల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు శనివారం సందర్శించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పరిధిలోని మెట్టు బండల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ( Paddy Procurement Centres ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ( Harish Rao) శనివారం సందర్శించారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ జరగక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మౌలిక వసతులు లేవనే సాకుతో ఎల్ 2 గ్రేడ్ కేటాయించి 50 ఐకేపీ కేంద్రాలను, 20 ప్యాక్స్ సొసైటీలను కలిపి మొత్తం 70 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం దారుణమని అన్నారు.
చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని కేంద్రాలు కూడా ఇందులో పోవడంతో 70 గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు ఆగిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.మరోవైపు రాష్ట్రం మొత్తం మీద ఇప్పటిదాకా ప్రభుత్వం కొన్న దొడ్డు వడ్లు కనీసం లక్ష మెట్రిక్ టన్నులు కూడా దాటలేదు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. కానీ ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనకుండా ప్రభుత్వం కావాలనే రైతులను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతులకు సరైన మద్దతు ధర లభించడం లేదని అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ వడ్ల కొనుగోళ్లకు ఇబ్బంది రాలేదు, కల్లాలకు రాగానే వెంటవెంటనే కొన్నాం. ఇప్పుడు కొత్తగా గ్రేడింగ్ పద్ధతి అని పెట్టి 70–80 సెంటర్లు మూసేశారని విమర్శించారు.ఉన్న సెంటర్లలోనూ వడ్లు కొనడం లేదు. ఇప్పటికీ మిల్లుల అలాట్మెంట్ జరగలేదు, గోదాముల ఏర్పాటు లేదు. కావాలనే ఆలస్యం చేస్తే రైతులు విసిగిపోయి బయట అమ్ముకుంటారని, తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లపై తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రేపో మాపో తుఫాన్ వస్తుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వర్షాలకు కల్లాల్లో ఉన్న వడ్లన్నీ తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ముప్పు ఉన్నా కనీసం టార్పాలిన్ కవర్లు ఇవ్వరు, వచ్చిన వడ్లను వెంటనే కొనరు, మిల్లులతో టైఅప్ చేయరు. కల్లాలకు వచ్చిన వడ్లను ఎత్తితే రైతుల బాధ తప్పుతుంది కదా అని సూచించారు. ఈ వానాకాలం సన్న వడ్లకు బోనస్ ఇస్తారా, ఇవ్వరా అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. సన్న వడ్ల బోనస్‌పై తక్షణమే జీవో విడుదల చేసి కొనుగోళ్లు చేపట్టాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
Double bedroom homes | నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ఎఫెక్ట్.. ‘డబుల్’ ఇళ్ల అక్రమ వసూళ్లపై వార్డు ఆఫీసర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

