Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
Road accident | మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న కారు అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
Road accident : మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న కారు అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన అశ్విని అనే నాలుగేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
గుంటూరు, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన పది మంది కారులో చీరాలకు సముద్ర స్నానాల కోసం వెళ్తుండగా కుంకలమర్రు సమీపంలోకి రాగానే కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో గుంటూరుకు చెందిన పల్లపు లక్ష్మయ్య (65), చిలకలూరిపేటకు చెందిన గుంజి నాగేంద్రం (55) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి అశ్వినిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. కారులో ప్రయాణిస్తూ గాయపడిన మరికొందరు చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చీరాల డీఎస్పీ మహమ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
Double bedroom homes | నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ఎఫెక్ట్.. ‘డబుల్’ ఇళ్ల అక్రమ వసూళ్లపై వార్డు ఆఫీసర్ సస్పెన్షన్
Diabetes | డయాబెటిస్ ఉన్నవారు షుగర్ స్థాయిలను తగ్గించుకోవడమే కాదు, వీటిని కూడా గమనించాలి..
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

