Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Donald Trump | వైట్‌హౌస్ (White House) మాజీ ప్రెస్ సెక్రెటరీ (Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి కొత్త సెక్రెటరీ ఎంపిక కోసం ట్రంప్ యంత్రాంగం వెతుకుతున్నది. ఇటీవల కేటీ జకారియా (Katie Zacharia) ను కొత్త ప్రెస్ సెక్రెటరీగా నియమించినా ఆమె పనితీరుపై విమర్శలు వచ్చాయి.
Donald Trump : వైట్‌హౌస్ (White House) మాజీ ప్రెస్ సెక్రెటరీ (Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి కొత్త సెక్రెటరీ ఎంపిక కోసం ట్రంప్ యంత్రాంగం వెతుకుతున్నది. ఇటీవల కేటీ జకారియా (Katie Zacharia) ను కొత్త ప్రెస్ సెక్రెటరీగా నియమించినా ఆమె పనితీరుపై విమర్శలు వచ్చాయి. ఆమె విద్యార్హతలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. దాంతో పదవి చేపట్టిన ఐదు రోజుల్లోనే తొలగించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోలిన్ లీవిట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాధ్యక్షుడినైన తనకంటే ఆమెకు బిడ్డపైనే ఎక్కువ ప్రేమ ఉందని అన్నారు. అందుకే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి విధుల్లోకి రావడానికి ఒప్పుకోలేదని చెప్పారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీగా ఆమె హుందాగా, అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. ఇప్పుడు ఆమె స్థానంలో మరొకరిని నియమించడం కష్టంగా మారిందన్నారు.
నిజంగా ఇది చాలా పెద్ద సమస్యని, ఈ విషయాన్ని తాను ఆమెతో కూడా చెప్పానని ట్రంప్ తెలిపారు. ఆమె నాకంటే తన బిడ్డనే ఎక్కువగా ప్రేమిస్తోందని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుతం కరోలిన్ ఓ మీడియా సంస్థలో పని చేస్తున్నదని, త్వరలోనే ఆమె ఒక పెద్ద స్టార్ అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్ సందడి.. తుది దశకు చేరుకున్న ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

