Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
Sruthi Hassan | రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా.. అందులో మహిళా పాత్రల చిత్రీకరణపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం, స్పెషల్ సాంగ్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు.
Sruthi Hassan | రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా.. అందులో మహిళా పాత్రల చిత్రీకరణపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం, స్పెషల్ సాంగ్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటి శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెద్ది’ సినిమాలో శ్రుతి హాసన్ ‘హెల్లల్లలో’ అనే స్పెషల్ సాంగ్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో కలిసి ఆమె వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాటలో నటించడానికి అంగీకరించడం వెనుక కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి వెల్లడించింది.
సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అవసరమా అనే ప్రశ్న తనకు కూడా అప్పుడప్పుడు వస్తుందని చెప్పిన ఆమె.. తనకు డ్యాన్స్ చేయడం, అందంగా ముస్తాబవ్వడం ఎంతో ఇష్టమని తెలిపింది. ఆ ఇష్టంతోనే ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించినట్లు వివరించింది. గ్లామర్ విషయంలో తాను ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటానని శ్రుతి హాసన్ స్పష్టం చేసింది. అయితే ఇతరులను మెప్పించడం కోసం తనకు ఇష్టం లేని దుస్తులు ధరించడం లేదా సన్నివేశాల్లో నటించడం చేయనని చెప్పింది. ఏదైనా సీన్లో లేదా కాస్ట్యూమ్స్ విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతానని వెల్లడించింది. ఈ విషయంలో గతంలో కొన్నిసార్లు వాదనలు కూడా జరిగినట్లు పేర్కొంది.
‘పెద్ది’ సినిమాలో మహిళల చిత్రీకరణపై జరుగుతున్న చర్చను తాను అర్థం చేసుకోగలనని చెప్పిన శ్రుతి.. తన వరకు మాత్రం పాటలోని కొరియోగ్రఫీని ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేయడమే ముఖ్యమని అభిప్రాయపడింది. ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ప్రస్తావన వచ్చినప్పుడు శ్రుతి హాసన్ ఆచితూచి స్పందించింది. ‘హెల్లల్లలో’ పాట కోసం జాన్వీతో కలిసి పనిచేసినప్పటికీ.. ఈ సినిమా విషయంలో ఆమెకు ఎదురైన అనుభవాల గురించి తాను మాట్లాడలేనని స్పష్టం చేసింది. ఎవరి అనుభవాలు, అభిప్రాయాలు వారే వెల్లడించడం సరైనదని పరోక్షంగా పేర్కొంది. దీంతో జాన్వీ గురించి శ్రుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో శ్రుతి హాసన్ బోల్డ్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

