Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Vijay Antony | సినిమా ప్రమోషన్లు అంటే సాధారణంగా స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్లు, మీడియా ఇంటర్వ్యూలు, భారీ ఈవెంట్లు గుర్తుకొస్తాయి. అయితే కొందరు హీరోలు మాత్రం తమ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటుంటారు. ఈ విషయంలో ‘బిచ్చగాడు’ ఫేమ్, తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ప్రత్యేకమే. తన సినిమాల కథల ఎంపికలోనే కాకుండా ప్రచార కార్యక్రమాల్లోనూ విభిన్నంగా వ్యవహరించే ఆయన.. తాజాగా తన కొత్త సినిమా ‘నాన్న కుట్టి’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వీధుల్లోకి వచ్చారు.
Vijay Antony | సినిమా ప్రమోషన్లు అంటే సాధారణంగా స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్లు, మీడియా ఇంటర్వ్యూలు, భారీ ఈవెంట్లు గుర్తుకొస్తాయి. అయితే కొందరు హీరోలు మాత్రం తమ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటుంటారు. ఈ విషయంలో ‘బిచ్చగాడు’ ఫేమ్, తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ప్రత్యేకమే. తన సినిమాల కథల ఎంపికలోనే కాకుండా ప్రచార కార్యక్రమాల్లోనూ విభిన్నంగా వ్యవహరించే ఆయన.. తాజాగా తన కొత్త సినిమా ‘నాన్న కుట్టి’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వీధుల్లోకి వచ్చారు. అమీర్‌పేటలో సామాన్యుడిలా తిరుగుతూ, స్వయంగా మిర్చి బజ్జీలు వేస్తూ, ఇరానీ చాయ్ తాగుతూ సందడి చేశారు.
తన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ ప్రమోషన్లలో భాగంగా సోమవారం సాయంత్రం విజయ్ ఆంటోనీ హీరోయిన్ ప్రీతి ఆస్రానీతో కలిసి హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చేరుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చిత్ర బృందంతో కలిసి సాధారణ వ్యక్తిలా రోడ్లపై తిరిగారు. దాదాపు అరగంట పాటు అక్కడి స్థానికులతో ముచ్చటిస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ చిరు వ్యాపారి బండి వద్ద ఆగిన విజయ్ ఆంటోనీ.. స్వయంగా మిర్చి బజ్జీలు తయారు చేశారు. వేడివేడిగా బజ్జీలు వేయడమే కాకుండా వాటిని అక్కడున్న అభిమానులకు, స్థానికులకు స్వయంగా పంచిపెట్టారు. స్టార్ హీరో తమ మధ్యకు వచ్చి ఇలా బజ్జీలు వేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.
బజ్జీలు వేసిన తర్వాత విజయ్ ఆంటోనీ, ప్రీతి ఆస్రానీ కలిసి ఏషియన్ సత్యం మాల్ సమీపంలోని ఓ ఇరానీ కేఫ్‌కు వెళ్లారు. అక్కడ సాధారణ కస్టమర్ల మాదిరిగానే కూర్చుని ఇరానీ చాయ్ తాగుతూ బన్ మస్కాను ఆస్వాదించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరోను ఒక్కసారిగా దగ్గరగా చూసిన అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. అయితే విజయ్ ఆంటోనీ మాత్రం ఎలాంటి అసహనం చూపకుండా అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. అభిమానులతో ఫొటోలు దిగుతూ, వారి అభిమానానికి స్పందించారు. దీంతో అమీర్‌పేట పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది.
నిజానికి ‘నాన్న కుట్టి’ సినిమా ప్రమోషన్ల కోసం విజయ్ ఆంటోనీ కొంతకాలంగా ఇలాంటి విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు సాధారణ రైలులోని జనరల్ బోగీలో ప్రయాణించారు. సామాన్య ప్రయాణికులతో కలిసి ఆయన చేసిన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు హైదరాబాద్‌లో అమీర్‌పేట వీధుల్లోకి వచ్చి బజ్జీలు వేయడం, ఇరానీ చాయ్ తాగడం వంటి కార్యక్రమాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఖరీదైన హోటళ్లలో ప్రమోషన్లు నిర్వహించడం కంటే నేరుగా ప్రేక్షకుల మధ్యకు వెళ్లి వారితో సమయం గడపడం ద్వారా తన సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతుగా కోదాడలో ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

