Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
Murthy | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవిప్రియ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయనపై తెలుగు సినీ పాత్రికేయ సంఘం (TFJA) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
Murthy | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవిప్రియ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయనపై తెలుగు సినీ పాత్రికేయ సంఘం (TFJA) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనకు సినీ ప్రముఖులు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర సినీ కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని సూచించింది. ఈ మేరకు నవంబర్ 23న తెలుగు సినీ పరిశ్రమకు TFJA అధికారికంగా లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు సినీ జర్నలిస్టుల సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వేదుల మూర్తికి ఎలాంటి సినిమా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. అలాగే చిత్రాల ప్రచార కార్యక్రమాలు, సినిమా విడుదల వేడుకలు, ఇతర ప్రమోషనల్ ఈవెంట్లలో ఆయనకు భాగస్వామ్యం కల్పించవద్దని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, చిత్ర బృంద సభ్యులను కోరింది.ఈ మేరకు ఓ అధికారిక లేఖను జారీ చేసింది. TFJA అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి. రఘు, పొలిట్‌బ్యూరో కన్వీనర్ వి. లక్ష్మీనారాయణ సంతకాలతో ఈ నోటీసు విడుదలైంది. సంఘం కార్యవర్గం తీసుకున్న నిర్ణయానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే దేవిప్రియపై తాజాగా ఇలాంటి ఆంక్షలు విధించడానికి గల నిర్దిష్ట కారణాలను మాత్రం TFJA తన లేఖలో వెల్లడించలేదు. దీంతో ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి కారణాలపై సినీ, మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వేదుల మూర్తి అలియాస్ దేవిప్రియ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన వృత్తిపరమైన వ్యవహారశైలి, సోషల్ మీడియా పోస్టులు, సినీ ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూల విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. 2024 డిసెంబర్లో జ్యోతిష్యుడు వేణుస్వామితో నిర్వహించిన ఇంటర్వ్యూ వివాదం నేపథ్యంలో TFJA ఆయనపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన క్షమాపణలు కోరడంతో తిరిగి సంఘంలోకి తీసుకున్నట్లు సమాచారం.అలాగే 2026 మార్చిలో తోటి జర్నలిస్టులపై ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఆయనపై మూడు నెలల సస్పెన్షన్ వేటు పడింది. మరోవైపు, ఇంటర్వ్యూలలో వ్యూస్ కోసం నటీనటులను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారనే విమర్శలు కూడా గతంలో ఆయనపై వచ్చాయి. ముఖ్యంగా ద్వంద్వార్థాలు వచ్చేలా ప్రశ్నలు వేస్తున్నారంటూ కొందరు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. గతంలో మంచు లక్ష్మితో నిర్వహించిన ఇంటర్వ్యూ కూడా వివాదానికి కారణమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతుగా కోదాడలో ప్రచారం
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

