Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Aadarsha Kutumbam | టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
Aadarsha Kutumbam | టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినప్పటికీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా తడబడింది. ముఖ్యంగా త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా భిన్నమైన ప్రయత్నంగా నిలిచినప్పటికీ ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఇక తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 27 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంట్లోనే ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుంది.
అయితే నవంబర్ 27 స్ట్రీమింగ్ తేదీపై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, సత్య, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే ‘ధురంధర్’ ఫేమ్ ఉదయ్ బిర్ సందు కూడా ఈ చిత్రంలో నటించారు. థమన్ సంగీతం అందించగా, హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

