Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
Trisha | సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారానికి తోడు, త్రిష పేరుతో తమిళనాడులో ఓ కొత్త సేవా సంస్థ ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది.
Trisha | సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారానికి తోడు, త్రిష పేరుతో తమిళనాడులో ఓ కొత్త సేవా సంస్థ ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు త్రిష రాజకీయ వారసురాలని సంస్థ నిర్వాహకులు వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తిరునల్వేలిలో ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ పేరుతో ఓ సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంఘం వ్యవస్థాపకుడిగా పేర్కొంటున్న రాజగోపాల్ తాజాగా సంస్థ లోగోను ఆవిష్కరించడంతో పాటు నూతన నిర్వాహకులను మీడియాకు పరిచయం చేశారు. సంస్థ లోగోపై ‘పదవుల కోసం కాదు.. తమిళ ప్రజల హక్కుల కోసం!’ అనే నినాదాన్ని పొందుపరిచారు. దీంతో ఈ సంస్థ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ మొదలైంది.
సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా రాజగోపాల్ త్రిష వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమర్థవంతమైన నాయకురాలని, ఆమె మాదిరిగానే త్రిష కూడా మంచి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. త్రిష రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, తాము త్రిషను జయలలిత రాజకీయ వారసురాలిగా భావిస్తున్నామని రాజగోపాల్ వెల్లడించారు. ఈ ఆలోచనతోనే ఆమె పేరుతో ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా? ఆమెకు ఈ సంఘంతో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలపై నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు.
ఈ సంఘం కేవలం అభిమాన సంఘంగా మాత్రమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వేదికగా పనిచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తామని తెలిపారు. మరోవైపు, త్రిష రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమె పేరుతో సేవా సంస్థ ఏర్పాటు కావడం, జయలలితతో పోలుస్తూ రాజకీయ వారసురాలిగా అభివర్ణించడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ పరిణామాలపై త్రిష స్పందన ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఆమె రాజకీయాలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Dada | డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’ జాతర.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తామంటూ మేకర్స్ హామీ!
Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

