Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ హౌస్‌లో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇన్ని రోజులు గ్రూపులుగా కలిసి ఆడిన కంటెస్టెంట్లు ఇప్పుడు వ్యక్తిగతంగా తమ ఆటను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో మాటల యుద్ధాలు, ఆరోపణలు, వాదోపవాదాలతో హౌస్ ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వర్షిణి–సుధీర్ మధ్య జరిగిన వాగ్వాదం, దేబ్జానీ–రామ్ ప్రసాద్ నామినేషన్, అమన్‌తో దేబ్జానీ గొడవ ఈ ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ హౌస్‌లో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇన్ని రోజులు గ్రూపులుగా కలిసి ఆడిన కంటెస్టెంట్లు ఇప్పుడు వ్యక్తిగతంగా తమ ఆటను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో మాటల యుద్ధాలు, ఆరోపణలు, వాదోపవాదాలతో హౌస్ ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వర్షిణి–సుధీర్ మధ్య జరిగిన వాగ్వాదం, దేబ్జానీ–రామ్ ప్రసాద్ నామినేషన్, అమన్‌తో దేబ్జానీ గొడవ ఈ ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి. కెప్టెన్ అమన్ నామినేషన్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో దేబ్జానీ అతడితో వాగ్వాదానికి దిగింది. అమన్‌ను ఉద్దేశించి ఆమె ‘పక్కకు పో’ అంటూ అనడంతో కెప్టెన్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చివరి వారాలు కావడంతో కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుండటంతో ఇలాంటి గొడవలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ నామినేషన్ల ఎపిసోడ్లో అత్యంత హైలైట్‌గా నిలిచింది వర్షిణి, సుధీర్ మధ్య జరిగిన వాదన. ‘రివార్డ్ రివేంజ్’ టాస్క్‌లో వర్షిణి వ్యవహరించిన తీరును తప్పుబడుతూ సుధీర్ ఆమెను నామినేట్ చేశాడు. తాను, శ్వేత కలిసి బాల్స్ వేస్తున్నారని మిగతా కంటెస్టెంట్లు భావించడంతో వారికి బాల్స్ ఇచ్చానని వర్షిణి వివరణ ఇచ్చింది. మరోవైపు రామ్ ప్రసాద్ కూడా ముకేష్‌కు సపోర్ట్ లభిస్తుందనే కారణంతో ఆ రోజు తనకు కావాల్సిన మద్దతు వర్షిణి ఇవ్వలేదని ఆరోపించాడు. ఈ ఆరోపణలను వర్షిణి ఖండించింది. సంచాలక్‌గా రోహిత్ ఉన్న సమయంలో తాను సాయం చేస్తే తప్పేంటని వర్షిణి ప్రశ్నించింది. ‘నన్ను చూడు.. నాతో మాట్లాడు’ అంటూ సుధీర్‌ను నిలదీసింది. అయితే సుధీర్ మాత్రం తన తప్పును అంగీకరించకుండా ఇతరుల పేర్లు చెబుతోందని విమర్శించాడు.
దీంతో వర్షిణి ‘నీకు ఎందుకు చెప్పాలి బై’ అంటూ ఎదురు ప్రశ్నించింది. నువ్వు నీ ఆట ఆడకుండా పక్కవాళ్ల ఆట గురించి మాట్లాడుతున్నావని సుధీర్ మండిపడ్డాడు. చివరకు కాఫీని వర్షిణి ముఖంపై కొట్టి ఆమెను నామినేట్ చేయడంతో ఈ గొడవ మరింత హాట్ టాపిక్‌గా మారింది. రామ్ ప్రసాద్‌ను దేబ్జానీ నామినేట్ చేయడం కూడా హౌస్‌లో చర్చకు దారి తీసింది. కెప్టెన్సీ తనకు ఎంత ముఖ్యమో తెలిసినా, ఆ సమయంలో రామ్ ప్రసాద్ తనకు మద్దతు ఇవ్వలేదని ఆమె కారణం చెప్పింది. దీనిపై రామ్ ప్రసాద్ స్పందిస్తూ.. తనకు కెప్టెన్సీ అవకాశం వస్తే దేబ్జానీనే కెప్టెన్‌గా చేయాలని అనుకునేవాడినని, ఆమెపై అంత ప్రేమ ఉందని చెప్పాడు. అయితే ‘కాఫీ అయిపోయింది’ అంటూ ఆమె చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, దేబ్జానీ ఇంత స్వార్థంగా వ్యవహరిస్తుందని ఊహించలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య జరిగిన ఈ నామినేషన్ సంభాషణ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ వారం నామినేషన్లలో శివ్, ముకేష్ల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. త్రిగుణ్‌కు బయట మంచి క్రేజ్ ఉందని భావించి అతడితో గొడవలు పెట్టుకోవడం ద్వారా స్క్రీన్ స్పేస్ సంపాదించేందుకు శివ్ ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారం మొత్తం ప్రశాంతంగా ఉంటూ నామినేషన్ల సమయంలో మాత్రమే ఫైర్ అవుతున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక డిక్టేటర్‌గా ముకేష్ తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోయాడనే అభిప్రాయం కొందరిలో ఉంది. గత కొంతకాలంగా నామినేషన్లలో కొనసాగుతున్న ముకేష్‌ను ఈసారి నరేష్, రామ్ ప్రసాద్ వంటి కంటెస్టెంట్లు కూడా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 10 చివరి దశకు చేరుకోవడంతో ప్రతి నామినేషన్, ప్రతి గొడవ కంటెస్టెంట్ల ప్రయాణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు గ్రూపులుగా ఉన్నవారు విడిపోతూ వ్యక్తిగత ఆటపై దృష్టి పెట్టడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం హౌస్‌లో కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. వర్షిణి, సుధీర్ మధ్య జరిగిన ఘర్షణ.. దేబ్జానీ, రామ్ ప్రసాద్ మధ్య నామినేషన్ వివాదం.. అమన్‌తో ఆమె గొడవ ఈ వారం ఎపిసోడ్‌ను మరింత రసవత్తరంగా మార్చాయి. మరి ఈ నామినేషన్ల పరిణామాలు ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఎవరు ఎలిమినేషన్ ముప్పులో పడతారు? అనేది తదుపరి ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aman
- bigg boss10
- debjani
- Nagarjuna
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
Panchayat Grading | పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం.. కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం!
Uttam Kumar Reddy | కార్యకర్తలకు న్యాయం జరుగలేదు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

